Andhra Pradesh: ఏపీలో 2014 సీన్ రీపీటేనా? పురంధేశ్వరి కామెంట్స్‌కి అర్థం అదేనా?!

ఏపీలో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. ఇప్పుడు బీజేపీ సైతం పొత్తుకు సై అంటోంది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి అన్నారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తాయని అంచనా వేస్తున్నారు.

New Update
Purandeswari: మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు: పురందేశ్వరి

Andhra Pradesh Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలు పొత్తుల కోసం కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన(Janasena), టీడీపీ(TDP), బీజేపీ(BJP) మధ్య పొత్తుల అంశంలో దోబూచులాట నడుస్తోంది. ఈ మూడు పార్టీల పొత్తుల అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న వేళ.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Daggubati Purandeswari) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓవైపు జనసేన-టీడీపీ పొత్తు ఇప్పటికే ఖరారు కాగా.. ఇప్పుడు జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని పురంధేశ్వరి ప్రకటించారు. దీంతో ఈ అంశంపై ఏపీ పాటిలిక్స్‌లో సంచనలం రేపుతోంది. ఏపీలో ఏం జరుగుతోంది? 2014 నాటి పాలిటిక్స్ మళ్లీ పునరావృతం అవుతాయా? అనే చర్చ నడుస్తోంది.

జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కాకినాడలో శుక్రవారం పర్యటించిన ఆమె రామారావుపేటలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీతో పొత్తు విషయాన్ని తమ అధినాయకత్వం చూసుకుంటుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు పురంధేశ్వరి. నాణ్యత లేని మద్యం, ఇసుక అక్రమాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాల కోసమే వెచ్చించాలని డిమాండ్ చేశారు. ఎవరు ప్రజల కోసం గొంతెత్తినా జగన్ అణచివేస్తారని, పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రి మనకు అవసరమా అని వ్యాఖ్యానించారు.

Also Read:

అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?!

టీడీపీ బీసీ మంత్రం.. జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’..

Advertisment
Advertisment
తాజా కథనాలు