Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన ‘మిచౌంగ్‌'!

ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్‌ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరి కాసేపట్లో తీరం దాటుతుందని అధికారులు వివరించారు. సాయంత్రానికి తుఫాన్‌ బలహీనపడుతుందని తెలిపారు.

New Update
Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన ‘మిచౌంగ్‌'!

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుఫాన్‌ (Michaung Cyclone)  బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరి కాసేపట్లో పూర్తిగా తీరాన్ని దాటనుందని అధికారులు వివరించారు. తుఫాన్‌ బాపట్ల తీరం దాటిన తరువాత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తుఫాన్‌ తీరం దాటే సమయంలో 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.మంగళవారం ఉదయం నుంచి కూడా ఈదురుగాలులు వీస్తుండడంతో కొన్ని జిల్లాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు కూడా కూలిపోయాయి. తీరానికి చేరువలో ఉన్న పూరి గుడిసెలు నేలకూలాయి.

తుఫాన్‌ ప్రభావంతో అధికారులు ఇప్పటికే పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటికే సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. విద్యుత్తును అధికారులు నిలిపేశారు.

ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also read:

Advertisment
Advertisment
తాజా కథనాలు