Cyclone Alert: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడనున్న 'మిగ్జామ్' తుపాను కారణంగా డిసెంబర్‌ 3-4 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు తమిళనాడుకు మాత్రం ఈ తుపాను ఎఫెక్ట్ గట్టిగానే ఉండనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.

New Update
Cyclone Alert: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!

Heavy Rains in AP and Telangana: ఓవైపు తెలంగాణ ఎన్నికల ఫీవర్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఊపేస్తుండగా.. మరోవైపు వరుణుడు స్లోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. 'మిగ్జామ్‌' తుపాను అల్లకల్లోలం సృష్టిస్తుందానన్న ఆందోళన నెలకొంది. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి డిసెంబర్ 4న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి, బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి డిసెంబర్ 3న 'మిగ్జామ్‌'' తుపాను(Michaung Cyclone)గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

భారీ వర్షాలు కురుస్తాయా?
ప్రస్తుతానికైతే ఈ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచనైతే లేదు. ఇవాళ(డిసెంబర్ 1), రేపు(డిసెంబర్ 2) అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే అల్పపీడనం తుపానుగా మారిన తర్వాత అంటే డిసెంబర్ 3-4 తేదీల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ నాలుగు రోజులూ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్‌ 3 తర్వాత ఈ తమిళనాడు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మియన్మార్ ప్రతిపాదించిన ఈ తుపానుకు 'మిచాంగ్' అని పేరు పెట్టారు. దీన్ని 'మిగ్జామ్'గా ఉచ్ఛరించాలి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ తుపాను పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇది ఏర్పడితే ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడిన నాలుగో తుపాను అవుతుంది. ఈ ఏడాది భారత జలాల్లో ఆరోది అవుతుంది.

డిసెంబర్ 3- 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ కోస్తా బెల్ట్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా. ఇక తుపాను కారణంగా సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ(IMD) హెచ్చరించింది.

Also Read: టుక్‌ టుక్‌ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!

Advertisment
తాజా కథనాలు