/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T185530.779.jpg)
Mumbai : సాధారణ ప్రజలనే మాత్రమే కాదు ప్రముఖులు, న్యాయమూర్తులనూ సైతం వదలట్లేదు సైబర్ నేరగాళ్లు (Cyber Criminals). ఏకంగా జిల్లాకోర్టు జడ్జి (District Court Judge) నే బురిడి కొట్టించి భారీ మొత్తంలో దోచేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఫొటో వాడుకుని నట్టేటా ముంచేసిన సంఘటన మహారాష్ట్రాలో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన జిల్లా జడ్జి రూ.50 వేలు మోసపోయారు.
వాట్సప్ డీపీలో న్యాయమూర్తి ఫొటో..
శుక్రవారం జడ్జి మొబైల్‌కు ఓ వాట్సప్ మెసేజ్ (WhatsApp Message) వచ్చింది. అందులో 'నేను ముంబై హైకోర్టు (Mumbai High Court) న్యాయమూర్తిని. నాకు ఒక రూ.50,000 పంపండి. సాయంత్రం వరకూ మళ్లీ ఇస్తాను' అంటూ దుండగుడు మెసేజ్ చేశాడు. వాట్సప్ డీపీలో న్యాయమూర్తి ఫొటో ఉండటంతో నిజమేనని నమ్మి జిల్లా జడ్జి డబ్బులు పంపించారు. ఈ క్రమంలోనే ఆగంతకుడినుంచి మరిన్ని డిమాండ్లు రావడంతో జడ్జికి అనుమానం వచ్చి హైకోర్టు రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. ఆయన డబ్బులు అడగలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : రెండు ముక్కలైన ఎక్ల్సేటర్.. ఇరుక్కుపోయిన వ్యక్తి.. వీడియో వైరల్..!