Traffic Police : హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) హెచ్చరికలు జారీ చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Cyberabad Traffic Police) మార్చి 22 నుంచి ఐకియా(IKEA) రోటరీకి వెళ్లే మార్గాల్ల ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే వారు ఏఏ రూట్లలో వెళ్లాలో కూడా అధికారులు వివరించారు. బయోడైవర్సిటీ జంక్షన్(Bio-Diversity Junction) నుంచి ఐకియా రీటరీ వైపు వచ్చే ట్రాఫిక్... సైబర్ టవర్(Cyber Tower) లను చేరుకోవాలనే తొందరతో ఉన్న ప్రయాణికులు ఐకియా అండర్ పాస్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని అధికారులు తెలిపారు.
కేబుల్ బ్రిడ్జి(Cable Bridge) వైపు నుంచి ప్రయాణించే వారు ఐకియా రోటరీ వద్ద కుడి మలుపు తీసుకుని రోటరీ వద్ద నుంచే యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో వెళ్లాలని అధికారులు తెలిపారు.సైబర్ టవర్స్ నుంచి ఐకియా రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఐకియా రోటరీ వద్ద నుంచి యూ- టర్న్ తీసుకోవాలని అధికారులు తెలిపారు.
కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ తీసుకోవచ్చు. బయో డైవర్సిటీ జంక్షన్ కు చేరుకోవాలనుకునే ప్రయాణీకులు ఐకీయా అండర్ పాస్ ద్వారా తమ ప్రయాణాన్ని సాగించాలి. మీనాక్షి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్.. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు నేరుగా ఐకియా రోటరీ వైపు వెళ్లాలి. సీ-గేట్ చేరుకున్న తర్వాత ఐకియా రోటరీ వద్ద నేరుగా U-టర్న్ తీసుకోవాలని సూచించారు.
Also Read : కాకినాడలో జంట హత్యల కలకలం..అడ్డొచ్చిన మహిళ ని కూడా