CWC Recruitment 2023: అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల కోసం 150కు పైగా ఖాళీల కోసం CWC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ www.cewacor.nic.in లో నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ (ఆగస్టు26)ప్రారంభమైంది . మొత్తం 153 పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులపై ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిగా డిటైల్స్ చదవాలి. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, శాలరీ ఇతర వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి.
➼ వయో పరిమితి:
• కనీస వయస్సు - 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు - 45 సంవత్సరాలు
• వయో సడలింపు ప్రభుత్వ నియమాలపై ఆధారపడి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
➼ రాత పరీక్ష
➼ ఇంటర్వ్యూ
➼ డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
⁍ దరఖాస్తు ప్రారంభ తేదీ - 26 ఆగస్టు 2023
⁍ ఫారమ్ దరఖాస్తుకు చివరి తేదీ - 24 సెప్టెంబర్ 2023
⁍ పరీక్ష తేదీ - ఇంకా ప్రకటించలేదు
⁍ ఇంటర్వ్యూ తేదీ - ఇంకా ప్రకటించలేదు
⁍ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ – ఇంకా ప్రకటించలేదు
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
• అభ్యర్థులు www.cewacor.nic.in లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
• ఆ తర్వాత అప్లై ఆన్‌లైన్ (Apply online) లింక్‌పై క్లిక్ చేయండి.
• మీ కొత్త రిజిస్ట్రేషన్(New Registration)ను ప్రారంభించండి.
• ఆపై మీ వివరాలను ఫారమ్‌లో ఫిల్ చేయండి.
• మీ డాక్యుమెంట్‌ని జాగ్రత్తగా అప్‌లోడ్ చేయండి.
• దరఖాస్తు రుసుము చెల్లించండి.
• మీ దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకోండి.
CWC జీతం:
ఎంపికైన అభ్యర్థులు ఇతర పెర్క్‌లు, ప్రయోజనాలతో పాటు మంచి జీతాన్ని పొందుతారు. 40,000 నుంచి రూ. 93,000 వరకు శాలరీ ఉంటుంది.
ALSO READ: IOCLలో జాబ్స్‌కి నోటిఫికేషన్.. అర్హత, శాలరీ, ఖాళీల వివరాలివే!