Pat Cummins Hat-Trick: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) చరిత్రలో చాలా మంది బౌలర్లు హ్యాట్రిక్ సాధించడం మనం చాలాసార్లు చూసాం. కానీ, బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ సాధించడం ఎప్పుడూ చూడలేదు కదా. ఇదిగో ప్యాట్ కమ్మిన్స్ అది చేసి చూపించాడు. T20 ప్రపంచ కప్ 2024 సూపర్-8లో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన తర్వాత, ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ ఈరోజు జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్‌పై (AFG VS AUS) కూడా తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. పాట్ కమిన్స్ టీ20 కెరీర్‌లో రెండో హ్యాట్రిక్‌తో పాటు, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది 8వ హ్యాట్రిక్.
రెండు మ్యాచ్‌ల్లోనూ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించిన విధానం కూడా ఒకేలా ఉంది. బంగ్లాదేశ్‌పై కూడా అతను రెండు ఓవర్లలో తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై (Afghanistan) మ్యాచ్ లో కూడా అదే కనిపించాడు. బంగ్లాదేశ్‌పై కూడా 18వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించే పనిని ప్రారంభించి 20వ ఓవర్లో పూర్తి చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా అచ్చం అలానే జరగడం విశేషం. ఇక్కడ కూడా 18వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ను ప్రారంభించి 20వ ఓవర్‌లో ముగించాడు.
150వ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్..
అయితే, ఆఫ్ఘనిస్తాన్‌పై హ్యాట్రిక్ తన 150వ T20 మ్యాచ్‌లో రావడం ప్యాట్ కమిన్స్ కు మరింత ప్రత్యేకమైనది. ఆఫ్ఘనిస్థాన్‌పై 18వ ఓవర్ చివరి బంతికి ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ దిశలో బౌలింగ్ ప్రారంభించాడు. అతని మొదటి బాధితుడు రషీద్ ఖాన్. దీని తర్వాత, 20వ ఓవర్ మొదటి బంతికి, కరీం జానత్ కొట్టిన షాట్ ని డేవిడ్ వార్నర్ క్యాచ్ పట్టడం ద్వారా అతను తన రెండవ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి బంతికి, గుల్బాదిన్‌ను అవుట్ చేయడం ద్వారా వరుసగా రెండో హ్యాట్రిక్ పూర్తి చేశాడు ప్యాట్ కమిన్స్.
పాట్ కమిన్స్ రికార్డులు..
ఆఫ్ఘనిస్థాన్‌పై హ్యాట్రిక్ సాధించి పాట్ కమిన్స్ తన పేరిట అనేక రికార్డులు కూడా సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 2 హ్యాట్రిక్‌లు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. T20 ఇంటర్నేషనల్‌లో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ సాధించిన ప్రపంచంలోనే మొదటి బౌలర్ గా కమిన్స్ నిలిచాడు. ఇది కాకుండా, T20 ప్రపంచ కప్ 2024లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ అలాగే T20 ప్రపంచ కప్‌లో 2 హ్యాట్రిక్‌లు సాధించిన మొదటి బౌలర్.
Also Read: ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది..ఆస్ట్రేలియాను ఓడించింది