CSDS Survey: ఎన్నికల సంఘంమీద నమ్మకం తగ్గింది..సీఎస్డీఎస్‌ సర్వేలో సంచలన విషయాలు

భారత ఎన్నికల సంఘం అంటే ఈసీ మీద నమ్మకం తగ్గిందని ప్రజలు చెబుతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పనితీరు పట్ల భారతీయులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సీఎస్డీఎస్ లోక్‌నీతి ప్రీ పోల్ సర్వేలో ఈ సంచలన విషయం బయటపడింది.

New Update
Sajjala : సజ్జలతో పాటు ఇతర సలహాదారులు ఈసీ ఊహించని షాక్.. అలా చేస్తే వేటే!

CSDS Survey: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు ఆసక్తికర, సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ టైమ్‌లో సాధారనంగా సర్వేలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిల్లో భాగంగా సీఎస్డీఎస్ లోక్‌సీతి ప్రీ పోల్ ఒక సర్వే నిర్వహించింది. అయితే ఈ సారి సర్వే రాజకీయ పార్టీలు లేదా నాయకుల మీద కాకుండా భారత ఎన్నికల సంఘం గురించి జరిగింది. ఇందులో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ సర్వేలో ఈసీ మీద జనాలకు నమ్మకం తగ్గిపోయిందని తెలుస్తోంది. ఈసీ కూడా న్యాయంగా పని చేయడం లేదని భారతీయులు అంటున్నారు.

ఈసీతో పాటు దర్యాప్తు సంస్థలపైనా సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2019 కంటే ఇప్పుడు ఈసీపై మరింత నమ్మకం తగ్గిపోయిందని ఓటర్లు అంటున్నారు. 2019లో ఈసీపై నమ్మకముందని 51శాతం మంది చెబితే..2024లో ఈ సంఖ్య 29శాతానికి పడిపోయింది. ఇక ఈసీపై అస్సలు నమ్మకం లేదని 9శాతం మంది చెబుతున్నారు. దీంతో పాటూ ఈవీఎంలపైనా ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలను తారుమారు చేసే అవకాశం ఉందని 17శాతం మంది ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొంతమంది కొంతవరకు అవకాశముందని 28శాతం మంది సందేహం వ్యక్తం చేశారు.

మరోవైపు దర్యాప్తు సంస్థలపై సర్వేలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం పని చేస్తున్న విధానం, తీరు అంతా రాజకీయ కుట్రలో భాగమని 21శాతం ఎన్డీఏ ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. లేదు లా కాదు ఆ సంస్థలు చట్టానికి లోబడే పనిచేస్తున్నాయని 45శాతం మంది ఎన్డీఏ ఓటర్లు అంటున్నారు. ఇండియా కూటమిని సోర్ట్ చేసే ఓటర్లలో 51 శాతం మంది అయితే రాజకీయ కుట్రలో భాగమేనని కుండ బద్ధలు కొడుతున్నారు. మరోవైపు చట్టానికి లోబడి పనిచేస్తున్నాయని 19శాతం మంది తటస్థ ఓటర్లు చెప్పారు. ఈసర్వేలు అననీ మొత్తం ఇండియాలో ఉన్న 19రాష్ట్రాల్లో 10వేలమందికి పైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించి చేశారు. 100 ఎంపీ..100అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు.

Also Read:Breaking: ఏపీ గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు