కేదార్నాథ్లో గుర్రాలపై క్రూరత్వం ఈ మధ్యకాలంలో మనుషులపైనే కాదు జంతువుల పైన కూడా దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా కేదార్‌నాథ్ క్షేత్రంలో జంతువులను హింసిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మనుషులను, వస్తువులను మోసుకెళ్లే గుర్రాలు, గాడిదలకు బలవంతంగా ధూమపానం తాగిస్తున్నారు. గాయాలైనా పనిచేయిస్తున్నారు. దీనిపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. By Vijaya Nimma 24 Jun 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్లో జంతువులు హింసకు గురవుతున్నాయి. పర్వతాలను ఎక్కుతూ.. మనుషుల్ని, వస్తువుల్ని తరలించే గుర్రాలు, గాడిదలను హింసకు గురిచేస్తున్నారు. వీటికి బలవంతంగా ధూమపానం తాగిస్తున్నారు వాటి యజమానులు. కర్రలు, రాడ్లతో కొడుతూ.. దీంతో గాయాలైనా పని చేయిస్తూ.. వాటిపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గుర్రానికి సిగరెట్లు తాగిస్తున్న వీడియో వైరల్ అయింది. సిగరెట్లు తాగిస్తూ.. కర్రలతో కొడుతూ ఈ పరిస్థితిపై జంతుసంరక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కొంతమంది ప్రతినిధులు స్పందించారు. 'గతేడాది కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. జంతువుల మృతదేహాలను నదుల్లో విసిరేస్తున్నారు. బలహీనమైన జంతువులతో పని చేయిస్తున్నారు. అక్కడ 2500 జంతువుల మాత్రమే అనుమతి ఉంటే.. 1400 జంతువులతోనే పనిచేయిస్తున్నారు. జంతువులు అలసిపోయినా.. వాటికి మత్తు ఇచ్చి ఉపయోగిస్తున్నారు. అవి చనిపోయేలా హింసిస్తున్నారు. ఇదంతా చూస్తూ వ్యవస్థ నిద్రపోతోందిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలపై పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. అయినా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ప్లీజ్ ప్లీజ్ కాపాడండి కేవలం బద్రీనాథ్, కేదార్నాథ్లోనే ఇలాంటి ఘటనలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే, ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో 2-3 నెలల పని ఉంటుంది. దీంతో ఏడాదికి సరిపడా ఇప్పుడు సంపాదించాలని.. గుర్రాలు, గాడిదలను హింసకు గురిచేస్తున్నారు. ప్రతి జంతువుకు పని చేయడానికి ఒక సామర్థ్యం ఉంటుంది. కానీ, ఇలాంటి ప్రాంతాల్లో వాటి శక్తికి మించి 4-5 రెట్లు ఎక్కువ పనిచేయిస్తున్నారు. అలా వాటి సామర్థ్యం పెంచడానికి మత్తు పదార్థాలు ఇస్తున్నారు. ఇలాంటివి ఇవ్వడం వల్ల జంతువుల అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. దీంతో అవి అనారోగ్యం పాలవుతాయి. అయినా వాటిని పనిచేయిస్తారు. దీంతో క్రమంగా ఆరోగ్యం క్షీణించి చనిపోతాయి. ఇది జంతు హింస కిందకు వస్తుంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పుశువైద్యుడు డాక్టర్ సందీప్. శక్తికి మించి పర్వతాలపైకి ఈ ఘటనపై స్పందించిన డాక్టర్ అశోక్ పన్వార్.. ఆ వీడియోలు తన వద్దుకు కూడా వచ్చాయని చెప్పారు. జంతువులకు ధూమపానం తాగిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని.. కేదార్‌నాథ్ సెక్టార్ అధికారి, స్థానిక వైద్యులను ఆదేశించారు. ఈ వీడియో పశుసంవర్థక శాఖ మంత్రి సౌరభ్ బహుగుణ దృష్టికి కూడా వెళ్లింది. ఈ విషయంపై నిందితులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. కేదార్‌నాథ్ యాత్రలో 399 జంతువులు పర్వతాలను ఎక్కలేకపోతున్నాయి. వాటిని అనర్హమైనవిగా ప్రకటించారు అధికారులు. అయినా వాటితో పనిచేయిస్తున్నారు వాటి యజమానులు. అలాంటి 15 మంది యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించని 211 మందికి జరిమానా విధించారు. మరో 300 మందిపై నిషేధం విధించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి