/rtv/media/media_files/2026/02/25/son-kill-father-2026-02-25-08-11-09.jpg)
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని నగరం లఖ్‌నవూలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు కన్నతండ్రిని తుపాకీతో కాల్చి చంపడమే కాకుండా, మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసి డ్రమ్ములో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మానవేంద్ర సింగ్ (50) నగరంలో పాథాలజీ ల్యాబులు, మద్యం దుకాణాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. భార్య తొమ్మిదేళ్ల క్రితమే మరణించగా, కుమారుడు అక్షత్ ప్రతాప్ (19), కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. కొడుకును డాక్టరుగా చూడాలన్నది తండ్రి కోరిక. ఇంటర్ పూర్తి చేసిన అక్షత్‌ను 'నీట్' పరీక్ష రాయాలని తండ్రి తరచూ ఒత్తిడి చేసేవాడు. అయితే, అక్షత్‌కు చదువుపై ఆసక్తి లేక, కుటుంబ వ్యాపారాలు చూసుకుంటానని గొడవపడేవాడు.
#WATCH Lucknow, Uttar Pradesh: DCP Central Vikrant Vir says, "A missing person's case was registered at the Ashiyana police station regarding Manvendra Pratap Singh, who left his home on the morning of the 20th. Police were investigating. Today, it was revealed that his son,… pic.twitter.com/ZWLvBeqjtP
— ANI (@ANI) February 23, 2026
ఈ నెల 20న ఇదే విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో అక్షత్ ఇంట్లోని లైసెన్స్‌డ్ తుపాకీతో తండ్రిని కాల్చి చంపాడు. ఆ శబ్దం విని పరుగున వచ్చిన 16 ఏళ్ల చెల్లెలిని చంపేస్తానని బెదిరించి నోరు మూయించాడు. అనంతరం డెడ్‌బాడీని మాయం చేయాలని అత్యంత కిరాతకంగా ఆలోచించాడు.
మృతదేహాన్ని మూడో అంతస్తు నుంచి కిందికి తెచ్చాడు. రంపంతో శరీర భాగాలను ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కాడు. కొన్ని భాగాలను కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతాల్లో పడేశాడు. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన అక్షత్.. తన తండ్రి ఢిల్లీకి వెళ్లారని, ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే, నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం సాయంత్రం పోలీసులు నిందితుడి ఇంటిని తనిఖీ చేయగా, డ్రమ్ములో ఉన్న శరీర భాగాలు బయటపడ్డాయి. దీంతో నిందితుడు అక్షత్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ విక్రాంత్ వీర్ వెల్లడించారు.
Follow Us