/rtv/media/media_files/2025/06/28/wife-takes-revenge-on-husbands-death-2025-06-28-12-52-17.jpg)
Wife takes revenge on husbands death
Crime: భర్తను హత్య చేసిన వారిని కసితీరా చంపి ప్రతీకారం తీర్చుకుంది ఓ భార్య. ఏడాది క్రితం భర్త శవం ముందు.. ''ఆయనను చంపిన వారిని చంపే వరకు మంగళసూత్రాన్ని తీయనని చేసిన శపథాన్ని నెరవేర్చుకుంది. తన భర్తను చంపి జైలుకెళ్లినా హంతకులు ఎప్పుడెప్పుడు బయటకొస్తారా? అని వెయిట్ చేస్తూ ఉంది. ఇటీవలే వాళ్ళు బెయిల్ పై బయటకు రాగానే కసితీరా హత్య చేసింది. ఈ విస్తుపోయే ఘటన కర్ణాటక రాష్ట్రం కలబురగిలో వెలుగు చూసింది.
భర్త చావుకు ప్రతీకారం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది నవంబర్ 12న నిందితురాలైన భాగ్యశ్రీ భర్త సోమనాథ్ ను సిద్దారుద అతడి కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. తన కళ్ళ ముందే భర్త హత్య గురవడంతో భాగ్య శ్రీ కుమిలిపోయింది. భర్త చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడే భర్త శవం ముందు ఓ ప్రతిజ్ఞ చేసింది. నీ చావుకు కారణమైన వారిని ఈ భూమి మీద లేకుండా చేసేవరకు మంగళసూత్రాన్ని తీయనని శపథం చేసింది.
ఈ మధ్యలో సోమనాథ్ హత్య కేసులో నిందితులుగా గుర్తించబడ్డ సిద్ధారుధ, జగదీష్, అన్నప్పను అరెస్ట్ చేసి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో సోమనాథ్ భార్య భాగ్యశ్రీ వీరు ఎప్పుడెప్పుడు బయటకొస్తారా? ఎప్పుడు పగతీర్చుకుందామా? అని ఎదురుచూస్తూ ఉంది. ఇటీవలే ఆ ముగ్గురు బెయిల్ పై బయటకు వచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సోమనాథ్ భార్య భాగ్యశ్రీ, ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళను చంపేందుకు పక్కా ప్లాన్ వేశారు.
పదిమంది అరెస్ట్
బెయిల్ పై బయటకు వచ్చిన సిద్ధారుధ, జగదీష్, అన్నప్పలు ఓ డాబాలో ఉన్నారని తెలుసుకున్న భాగ్యశ్రీ, ఆమె గ్యాంగ్ ఈనెల 24న వారిపై దాడి చేశారు. ముగ్గురిలో ఇద్దరిని హత్య చేయగా.. అన్నప్ప అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయాడు. అయినప్పటికీ వదలకుండా అతడిని వెంటాడింది. కానీ చీకట్లో సరిగ్గా కనిపించకపోవడంతో అన్నప్పకు బదులుగా మరో వ్యక్తిని చంపేసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం పదిమందిని అరెస్టు చేశారు. భాగ్యశ్రీ, సిద్ధినాద సాగర్, రచన్న్య అలియాస్ గిల్లి, చంద్రకాంత్, నాగరాజ్, పిరేష్ , నాగరాజ, ఇరన్న, భిర్ణ్య, నిందితులుగా గుర్తించారు.