ప్రియుడిపై మోజు.. భర్తను గొడ్డలితో నరికిన భార్య.. కొడుకు ఏం చేశాడంటే!

ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో నరికి చంపింది. కొన్నాళ్లకు కొడుకు నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
New Update

TG Crime: ప్రియుడి మోజులో భర్తను ఓ భార్య దారుణంగా చంపిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. అంతేకాదు కొడుకు కళ్లముందే కట్టుకున్న వాడిని కర్కశంగా కడతేర్చింది. మద్యం మత్తులో ఉన్న భర్తను గొడ్డలితో నరికి చంపింది. చనిపోయాడని నిర్ధారించుకునక్న తర్వాత కాసేపటికి ప్రమాదవశాత్తు జారి పడి తలకు గాయమై మరణించినట్లు అందరినీ నమ్మించింది. ఘోరాన్ని కళ్లారా చూసిన కొడుకుని బెదిరించి, బతిమాలి విషయం బయటకు రాకుండా దాచిపెట్టింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన ఎట్టకేలకు 37 రోజుల తర్వాత బయటపడగా వివరాలు ఇలా ఉన్నాయి. 

వివాహేతర సంబంధం మోజులో..

ఈ మేరకు సూర్యపేట సీఐ సురేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. హనుమతండాకు చెందిన ధరావత్‌ సైదా(45), కౌసల్యకు కొంతకాలం పెళ్లైంది. వీరిద్దరూ కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. సాయికుమార్‌, వినోద్‌ కుమార్ అనే ఇద్దరు కొడుకులున్నారు.  సాయి సూర్యాపేటలో క్యాటరింగ్‌ పని చేస్తుండగా.. వినోద్ ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. అయితే కౌసల్య అదే తండాకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ బండారం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న కౌసల్య.. ఆగస్టు 17న మద్యం మత్తులో ఉన్న భర్తతో గొడవపెట్టుకుంది. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయిన కౌసల్య.. ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్త తల పగలగొట్టింది. సైదా అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఈ ఘోరాన్ని కళ్లరా చూసిన కొడుకు వినోద్ ను ఎవరికీ చెప్పొద్దని కౌసల్య బతిమాలింది. తాను జైలుపాలైతే మీకు కష్టం అవుతుందని బయపెట్టి నోరు మూయించింది. సైదా బల్లపైనుంచి కిందపడి చనిపోయాడని అందరినీ నమ్మించింది. 

అయితే సెప్టెంబర్ 22న కొడుకు వినోద్‌తో కౌసల్యకు గొడవ జరిగింది. కోపంతో రగిలిపోయిన వినోద్‌.. తండ్రిని చంపిన సంగతి సోదరుడు సాయికుమార్‌కు చెప్పాడు. సాయికుమార్‌ వెంటనే సూర్యాపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కౌసల్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

#murder #suryapeta
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe