లా విద్యార్థిని లైంగిక దాడి కేసు.. బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం!

లా విద్యార్థిని లైంగిక దాడి కేసులో విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులకు ఎవరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించింది. వారికి కఠిన శిక్ష పడేవరకు పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చింది.

author-image
By srinivas
New Update
drrrer

Vishaka: విశాఖపట్నంకు చెందిన లా విద్యార్థిని లైంగిక దాడి నేపథ్యంలో విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులకు ఎవరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించింది. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు బార్ కౌన్సిల్ సభ్యులు వెల్లడించారు.  

నలుగురి కలిసి ఒకేసారి.. 

ఈ మేరకు విశాఖపట్నంలోని మధురవాడ NVP లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోన్న విద్యార్థినిపై అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థి వంశీ తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆగస్ట్ 13న ఆమెను స్నేహితుడి ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గాన్ని  ఫోన్లలో చిత్రీకరించి ఇదే అదనుగా ఆమెను బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరిచారు.

ఇది కూడా చదవండి: నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు!

ఎలా జరిగిందంటే.. 


విశాఖపట్నంలో మధురవాడలో ఓ కాలేజీలో యువతి న్యాయ విద్యను అభ్యసిస్తోంది. తనతో పాటు చదువుతున్న వంశీ అనే విద్యార్థితో ఆమె ఫ్రెండ్‌షిప్ చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను ఆగస్టు నెలలో కంబాలకొండకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఆ తర్వాత డాబాగార్డెన్‌లో నివాసం ఉంటున్న తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. వంశీ తర్వాత తన స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడంతో పాటు వీడియోలు తీశారు. అక్కడికి రెండు నెలల తర్వాత మళ్లీ కాల్ చేసి తమ కోరిక తీర్చాలని.. లేకపోతే వీడియోలు బయట పెడతామని బెదిరించారు. మానసికంగా కూడా ఆ యువతిని ఎంతో వేధించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేయగా.. తల్లిదండ్రులు గమనించి అడ్డుకుని అడిగారు. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

ఇది కూడా చదవండి: Maoist Attack: మవోయిస్టులకు మరో దెబ్బ.. శబరినదిలో భారీ ఎన్‌కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు