/rtv/media/media_files/2025/04/03/AgPCmwadorqIdt9eznd1.jpg)
Visakhapatnam incident
Ap News: భర్త క్షణిక ఆవేశం ఇద్దరి పిల్లలను తల్లిలేనివారిని చేసింది. వాగ్వాదంలో భార్యను కొట్టగా.. ఆమె తలకు బలంగా దెబ్బతగిలి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖలో డాన్సర్లుగా పనిచేస్తున్న బంగార్రాజు, రమాదేవి ఐదేళ్ల క్రితం ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడేళ్లుగా ఇద్దరూ ఇదే వృత్తి కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Also Read: అంత రెమ్యూనరేషన్‌కే ఇంత రెచ్చిపోవాలా.. బిగ్ బాస్ బ్యూటీని ఊతికారేస్తున్న నెటిజన్లు!
తరచూ గొడవలు..
అయితే గత ఏడాది నుంచి ఇద్దరి మధ్య తరచు గొడవలు రావడం మొదలయ్యాయి. ఇటీవలే మరోసారి గొడవ జరగడంతో రమాదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నిరోజులుగా అక్కడే ఉంది. కాగా, గతనెల 30న భార్య పుట్టింటికి వెళ్లి.. మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు బంగార్రాజు. భర్త చేష్టలతో విసిగిపోయిన రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరింది. దీంతో ఆమెను అడ్డుకొని మళ్ళీ వాగ్వాదానికి దిగాడు. కోపంతో భార్యపై దాడి చేశాడు. ఈ క్రమంలో కిందపడిపోయిన రమాదేవి తలకు బలంగా దెబ్బతగిలింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగార్రాజు కావాలని ఈపని చేయలేదని .. తన పిల్లలు అన్యాయం అవ్వకుండా బంగార్రాజు శిక్ష తగ్గించే విధంగా చూడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు తోటి డాన్సర్లు.
విశాఖ లో డాన్సర్ రమాదేవి ని భర్త బంగార్రాజు మందలించి చేయి చేసుకోవడంతో రమాదేవి కింద పడిపోయి తలకి గాయమై మృతి చెందిన నేపథ్యంలో తోటి డాన్సర్లు బంగారు రాజు కావాలని ఈ పని చేయలేదని తన పిల్లలు అన్యాయం అవ్వకుండా బంగార్రాజుకు శిక్ష తగ్గించే విధంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న తోటి… pic.twitter.com/JQD1wvCrth
— RTV (@RTVnewsnetwork) April 3, 2025