Road Accident: షాకింగ్ వీడియో.. భక్తులతో వెళ్తున్న బొలెరో కాలువలో పడి 11 మంది మృతి

యూపీలోని గోండా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవుని దర్శనం కోసం వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బొలెరోలో 15 మంది ఉండగా.. అందులో 11 మంది స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
uttar pradesh gonda road accident

uttar pradesh gonda road accident

ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవుని దర్శనం కోసం వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఇటియాథోక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బొలెరోలో 15 మంది ఉండగా.. అందులో 11 మంది స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

bolero overturned 11 people died

జలాభిషేకం, దర్శనం కోసం గోండాలోని ప్రసిద్ధ పృథ్వీనాథ్ ఆలయానికి వెళుతున్న కారులో 15 మంది భక్తులు ఉన్నారని స్థానికులు తెలిపారు. కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కన నిర్మించిన కాలువలో పడిపోయిందని చెప్పారు. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. 

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఇటియాథోక్ పోలీస్ స్టేషన్, NDRF, స్థానిక పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేయడానికి క్రేన్లు, ఇతర పరికరాలను ఉపయోగించారు. అనంతరం పోలీసులు డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారికి చికిత్స చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అధిక వేగం, రహదారి దుస్థితి ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

సీఎం ఆర్థిక సహాయం

ఈ దురదృష్టకర ప్రమాదంతో గోండా జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలనా అధికారులను ఆదేశించారు. 

Advertisment
తాజా కథనాలు