/rtv/media/media_files/2025/09/14/up-crime-2025-09-14-21-06-30.jpg)
ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. అనంతరం అతని మృతదేహాన్ని బైక్‌పై 25 కిలోమీటర్లు మోసుకెళ్లి పారేసిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు భార్య నేహా, ఆమె ప్రియుడు జితేంద్రలను అరెస్టు చేశారు.
నేహా తన భర్త నాగేశ్వర్ రౌనియార్‌ను ఒక గుర్తు తెలియని ప్రదేశానికి పిలిపించి, అతను స్పృహ కోల్పోయే వరకు మద్యం తాగించింది. అనంతరం ఆపై, జితేంద్ర సహాయంతో, అతని గొంతు కోసి, ఆయుధంతో దాడి చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని మోటార్‌బైక్‌పై 25 కిలోమీటర్లు తీసుకెళ్లి వదిలివేసారు. ఈ దారుణమైన పనిలో, నేహా తన బిడ్డను బైక్‌పై ముందు కూర్చోబెట్టుకొని, వెనుక తన భర్త శవాన్ని పట్టుకొని కూర్చుంది. మృతదేహం వీపు నేలకి రాపిడికి గురైనట్టుగా గాయలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
జైలుకు వెళ్లిన సమయంలో
నాగేందర్ గతంలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో నేహా, జితేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకుంది. నాగేందర్ జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీరి సంబంధాన్ని వ్యతిరేకించడంతో, అడ్డు తొలగించుకోవడానికి ఇద్దరూ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులు మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పడేసిన తర్వాత, ఆ ఇద్దరూ ముంబైకి పారిపోవాలని ప్లాన్ చేశారు, కానీ పార్తవాల్ సమీపంలో పోలీసులు నిందితులను మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
తన వాంగ్మూలంలో నేహా తన భర్త వేధింపులను వివరించింది. నాగేశ్వర్‌తో ఇకపై కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని పోలీసులకు చెప్పింది, విడాకుల విచారణ కొనసాగుతున్నప్పటికీ, అతను ఆమెను వదల్లేదు. వేర్వేరు నంబర్ల నుండి ఫోన్ కాల్స్ చేస్తూ పదే పదే ఆమెను వేధించేవాడు. తరచుగా జితేంద్రతో గొడవలకు దిగాడు. దీనివల్ల రోజువారీ గొడవలు జరిగేవి. విసుగు చెందిన నేహా, జితేంద్ర హత్యకు కుట్ర పన్నారు.