UP Crime : ఫ్రెండ్ అక్కతో ఎఫైర్..చెట్టుకు కట్టేసి తల, మొండెం నరికేశారు!

కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల ఓ వ్యక్తిని అతని స్నేహితులు ప్రలోభపెట్టి హత్య చేసి అతని తల నరికి, అతని మృతదేహాన్ని ఖననం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడి స్నేహితుడు తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఈ హత్యకు దారితీసింది.

New Update
up crime

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల ఓ వ్యక్తిని అతని స్నేహితులు ప్రలోభపెట్టి హత్య చేసి అతని తల నరికి, అతని మృతదేహాన్ని ఖననం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడి స్నేహితుడు తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఈ హత్యకు దారితీసింది. కాన్పూర్‌లోని చకేరి నివాసి అయిన బాధితుడు రిషికేశ్ ఆదివారం నాడు కనిపించకుండా పోయాడని అతని అన్నయ్య రవి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

పోలీసుల విచారణలో అతని మృతదేహం మహారాజ్‌పూర్ ప్రాంతంలో కనిపించగా, తల వేరు చేసి నది ఒడ్డున విసిరివేయబడింది. ఈ హత్యకు సంబంధించి నలుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఆగస్టు 29 సాయంత్రం రిషికేశ్‌ను అతని ఇద్దరు స్నేహితులు మోగ్లి,  నిఖిల్‌లు గణేష్ చతుర్థి వేడుకలను చూద్దామని తీసుకెళ్లారు. అక్కడకి వెళ్లాక మరికొంతమంది కూడా అక్కడికి చేరుకుని రిషికేశ్ ను బలవంతంగా లాకెళ్లి కాన్పూర్ శివార్లలోని ఏకాంత ప్రాంతం అయిన కాకోరి అడవి వైపు తీసుకెళ్లారు.

రెండు రోజుల తర్వాత, రిషికేశ్ తిరిగి రాకపోవడంతో, అతని అన్నయ్య పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. కాకోరి అడవిలో రిషికేశ్‌ను తాడుతో కట్టివేసి, కాళ్ళు కట్టి, కత్తితో గొంతు కోసి మరి చంపేశారు.  మృతదేహాన్ని గుర్తించకుండా ఉండటానికి అతని తల నరికి చంపినట్లుగా నిందితులు అంగీకరించారు. ఆ తర్వాత ఒక ఇ-రిక్షాను కొనుగోలు చేసి, అందులో మృతదేహంలోని తెగిపోయిన భాగాలను జాజ్మౌ వంతెన వరకు తీసుకెళ్లి వేర్వేరు దిశల్లో గంగా నదిలో విసిరివేశారు. ప్రధాన నిందితుడిని పవన్ మల్లాగా గుర్తించారు.

గతంలో నేర చరిత్ర  ఉండటంతో

ఇతని సోదరితో  రిషికేశ్‌ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. గతంలో నేర చరిత్ర  ఉండటంతో ఉన్న పవన్, కాన్పూర్ జిల్లా నుండి ఆరు నెలల పాటు పోలీసులు బహిష్కరించారు. అతను తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం తెలియడంతో కోపంతో రగిలిపోయి రిషికేశ్‌ ను చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. బాధితుడి కుటుంబ సభ్యులు అతని కుడి చేతిలో ఉన్న పచ్చబొట్టు, మణికట్టు చుట్టూ కట్టిన దండ ఆధారంగా వారు ఆ శరీర భాగాలను రిషికేశ్ కు చెందినవిగా గుర్తించారు.  స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Advertisment
తాజా కథనాలు