/rtv/media/media_files/2025/03/01/vLanbfyKqJbMJ2znmQYF.jpg)
జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ పిల్లలు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం సెరెంగాడగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెసాగ్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్‌లో దాదాపు 12 మంది ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్ సెరెంగాడగ్ నుండి పహాడ్ దండు వైపు వెళుతుండగా హెసాగ్ బత్రు వంతెన వద్దకు చేరుకునేసరికి, ట్రాక్టర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడింది.
Also read : గుడ్ న్యూస్ ... తెలంగాణలో వారికి రేపటి నుంచి ఒంటిపూట బడులు
Also read : Tea Vs Water: ఉదయం టీ తాగేముందు నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా?
ఇద్దరు మైనర్లు స్పాట్
ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు స్పాట్ లో చనిపోయారు. మృతులను 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల ఉరాన్ గా గుర్తించారు. ఇద్దరూ తురియాదిహ్ గ్రామ నివాసితులుగా గుర్తించారు. గాయపడిన వారిని అమీన్ ఒరాన్, రూపేష్ ఒరాన్, ప్రేమ్ లోహారా, పంకజ్ లోహారా , మంజీత్ ఒరాన్‌గా గుర్తించారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులందరినీ త్వరత్వరగా లోహర్దగాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ శంభునాథ్ చౌదరి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం లోహర్‌దగా సదర్ ఆసుపత్రికి పంపారు.
Also read : ఉమెన్స్ డే స్పెషల్.. పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మంది మహిళలతో సభ: మంత్రి సీతక్క