TG CRIME : చిన్ననాటి స్నేహితులు.. ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకుని.. మిస్టరీ డెత్స్!

చిన్ననాటి స్నేహితులు ఒకరి తర్వాత మరొకరు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది.

New Update
hyd

చిన్ననాటి స్నేహితులు ఒకరి తర్వాత మరొకరు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే ఇంతలోనే స్నానం చేస్తానని తల్లితో చెప్పిన  వైష్ణవి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతకూ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా..  వైష్ణవి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైష్ణవి చనిపోయినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.

పడుకోవడానికి బెడ్‌షీట్‌ తీసుకుని వెళ్లి

ఇక  అదే గ్రామానికి చెందిన వైష్ణవి ఆమె క్లాస్‌మేట్‌ సతాలీ రాకేష్‌ (21) బుధవారం రోజు రాత్రి 10.30 గంటలకు తన ఇంటికి సమీపాన ఉన్న ఓ షట్టర్‌ రూమ్‌లో పడుకోవడానికి బెడ్‌షీట్‌ తీసుకుని వెళ్లి అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  గురువారం ఉదయం అతని తల్లి యాదమ్మ ఊడ్చుతుండగా.. రాకేష్‌ ఉరి వేసుకుని కనిపించాడు. రాకేశ్‌ మరణవార్త తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన బుద్ద నర్సింహ రెండో కుమార్తె శ్రీజ (18) ఇంట్లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది. ఉదయం 11.45 గంటలకు దివ్యాంగురాలైన బుద్ద నర్సింహ మూడో కుమార్తె నందిని వెళ్లి.. పక్కింట్లో ఉంటున్న తన సోదరుడికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పింది. అతడు వచ్చేసరికి గడియ పెట్టి ఉంది. తలుపులు విరగ్గొట్టి చూస్తే శ్రీజ ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.

మిస్టరీ డెత్స్!

వైష్ణవి మృతి విషయం తెలిసి రాకేష్, వారిద్దరి మరణాల గురించి తెలిసి శ్రీజ బలవన్మరణాలకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ ముగ్గురి ఆత్మహత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. వీరి ఆత్మహత్యలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు గౌడ్‌ వెల్లడించారు. కాగా వీరంతా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు