/rtv/media/media_files/2025/06/30/tamilnadu-dowry-death-2025-06-30-09-38-00.jpeg)
tamilnadu dowry death
Crime: 800 గ్రాముల బంగారం, 70 లక్షలు విలువచేసే కారు అల్లుడికి వరకట్నంగా ఇచ్చి ఒక్కగానొక్క కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు ఓ కన్నతండ్రి. కానీ, ఆ సంతోషం పట్టుమని పది నెలలు కూడా ఉండలేదు. అత్తింటి వరకట్న వేధింపులు తట్టుకోలేక పెళ్ళైన 2 నెలలకే కూతురు పురుగుల మందు తాగి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అమ్మా, నాన్నా నేను వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాను అంటూ తండ్రికి చివరి మెసేజ్ పంపి ప్రాణాలు తీసుకుంది ఆ నవ వధువు! అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఇకలేదని తెలియడంతో ఆ తల్లిదండ్రులు గుండెపగిలేలా విలపిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది.
వరకట్న వేధింపులు
ప్రాథమిక సమాచారం ప్రకారం.. తమిళనాడులో ఓ గార్మెంట్ కంపెనీ నడుపుతున్న అన్నాదురై తన కూతురు రిధన్యను ఈ ఏడాది ఏప్రిల్ 28న కవిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. 800 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ. 70 లక్షల విలువైన వోల్వో కారు అల్లుడికి కట్నం కింద ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ కవిన్ ఆశ తీరలేదు. పెళ్ళైన కొద్దిరోజుల నుంచి భార్యను రోజు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. కవిన్ తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా రిధన్యను వేధింపులకు గురిచేశారు. దీంతో రిధన్య తట్టుకోలేకపోయింది.
A 27 year old woman died by suicide after 78 days of being married reportedly over dowry torture by in-laws in Thirupur. pic.twitter.com/wmlydDTdJr
— Pramod Madhav (@PramodMadhav6) June 30, 2025
పురుగుల మందు తాగి!
ఆదివారం మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. మార్గమధ్యలోనే తన కారును ఆపి కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చాలా సేపు ఆ ప్రాంతంలో కారు నిలిపి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రిధన్య చనిపోయే ముందు తన తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో సందేశాలను పంపినట్లు సమాచారం. భర్త కవిన్ కుమార్, అత్త చిత్రాదేవి, మామ ఈశ్వరమూర్తి, తనను శారీరకంగా, మానసికంగా హింసించారని, తాను ఇక జీవించలేనని, వేరే జీవితం వెతుక్కునే ఓపిక కూడా లేదని ఆమె ఆ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Ananya Nagalla: మోడ్రన్ లుక్ లో పిచ్చెక్కిస్తున్న తెలంగాణ పోరి! ఫొటోలు చూశారా?