Suryapet Murder: సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహమే ఈ హత్యకు కారణమని అనుమానాలు యువకుడి కుటుంబ సభ్యులు, అతడి భార్య ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా RTV తో మాట్లాడిన కృష్ణ భార్య భార్గవి భర్త హత్య గురించి పలు సంచలన విషయాలు బయటపెట్టారు.
RTV తో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు ..
కృష్ణను ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదని. ఈ విషయంపై పలు మార్లు ఆమె అన్న తమను బెదిరింపులకు గురిచేశాడని . ఇది పాత కక్షల వల్ల జరిగిన హత్య కాదు.. కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆమె అన్నయ్యే తన భర్తను హత్య చేయించినట్లు భార్గవి ఆరోపించింది. బైర్ మహేష్ అనే వ్యక్తితో చేత హత్య చేయించినట్లు చెప్పింది.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
అసలేం ఏం జరిగిందంటే
అయితే కృష్ణ ఆరునెలల క్రితం భార్గవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో భార్గవి సోదరుడు కృష్ణ పై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఈరోజు ఉదయం జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే కెనాల్ కట్టపై పై శవమై కనిపించాడు. అతడిని బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులే తమ కొడుకును హత్య చేయించారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ హఠాత్తుగా హత్యకు గురికావడం మరో అనుమానానికి తెరలేపింది. కృష్ణ హత్యకు పాత కక్షలు కారణమా? లేదా
పరువు హత్యనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్