/rtv/media/media_files/2026/02/05/vijaya-reddy-2026-02-05-19-05-06.jpg)
హైదరాబాద్‌లోని చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సక్సెస్‌ఫుల్ కెరీర్, మంచి లైఫ్ ఉన్నప్పటికీ ఆమె ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. పోలీసుల విచారణలో ఈ కేసుపై రోజురోజుకో కొత్త విషయాలు బటయకు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు విజయ తన కూతురిని హాస్టల్ నుండి ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు రాత్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. విచారణలో భాగంగా సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురూ చాలా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నట్లు కనిపించింది. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే విజయ తన తల్లికి ఫోన్ చేసి మేము ఓ ఫంక్షన్‌కు వచ్చామని చెప్పారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురూ రైలు పట్టాల మధ్య నడుచుకుంటూ వెళ్లడం, అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో వారు ప్రాణాలు అక్కడికక్కడే చనిపోయారు.
ఆర్థిక ఇబ్బందులా? ఆదాయం భారీగానే ఉన్నా..
పోలీసులు ఫస్ట్ ఆర్థిక కారణాలపై ఫోకస్ చేశారు. కానీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విజయకు ఐటీ ఉద్యోగం ద్వారా నెలకు లక్ష రూపాయల జీతం వస్తోంది. దానికి తోడు ఇంటి అద్దెల ద్వారా అదనపు ఆదాయం ఉంది. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త సురేందర్ రెడ్డి జీతం కూడా నేరుగా విజయ ఖాతాలోనే జమ అవుతోంది. పిల్లల ఐఐటీ చదువుల కోసం భర్త విదేశాలకు వెళ్లగా, ఇక్కడ విజయ అన్ని విషయాలను చక్కగా చూసుకునేవారని బంధువులు చెబుతున్నారు.
కలహాలు లేవు.. అన్నోన్య దాంపత్యం
దుబాయ్ నుండి భారత్‌కు చేరుకున్న విజయ భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తమ మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. విజయ అన్న చిరంజీవి రెడ్డి కూడా తన చెల్లి కాపురంలో ఎలాంటి సమస్యలు లేవని, వారు చాలా సంతోషంగా ఉండేవారని తెలిపారు. దీంతో ఇది కుటుంబ కలహాల వల్ల జరిగిన ఆత్మహత్య కాదనే నిర్ధారణకు పోలీసులు వస్తున్నారు.
మిస్టరీగా మారిన ఆ 'వాట్సాప్ మెసేజ్'
ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు విజయ మొబైల్ ఫోన్ చుట్టే తిరుగుతోంది. ఆమె ఓ ఐటీ కంపెనీలో 15 మందికి టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పరిశీలించగా ఓ నంబర్ నుండి "సారీ మేడం.. ఇంకోసారి తప్పు చేయను" అనే మెసేజ్‌తో పాటు మరికొన్ని సందేశాలు వచ్చాయి. ఈ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు? ఆఫీస్ ఒత్తిడి ఏమైనా ఉందా? లేక ఆ వ్యక్తికి విజయ ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆర్థికంగా నిలకడగా ఉండి, కుటుంబంలో గొడవలు లేకపోయినా వెల్ సెట్టిల్డ్ మహిళా ఇంజినీర్ తన బిడ్డలతో సహా రైలు కింద పడటం వెనుక ఉన్న ఆ 'అదృశ్య కారణం' ఏమిటో తేలాల్సి ఉంది.
Follow Us