/rtv/media/media_files/2025/10/31/konaseema-2025-10-31-09-54-09.jpg)
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి నీచానికి ఒడిగట్టాడు. ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక టీచర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోనసీమ జిల్లాఈ ఐ.పోలవరం మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికను అదే స్కూల్లో పీఈటీ టీచర్ గా పనిచేస్తున్న రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాక్లెట్స్ ఇస్తానని చెప్పి మైనర్ బాలికను రూమ్ కి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కూతురు వరసైన మరొక మైనర్ బాలికపై
దీంతో బాలిక జరిగిందంతా వెళ్లి తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఎస్పీకి పిర్యాదు చేసింది బాలిక తల్లి. ఎస్పీ ఆదేశాలతో బాలిక తల్లి నుండి పిర్యాదు తీసుకుని 6 ఎ ఫోక్సో, సెక్షన్ 725 కేసు నమోదు చేశారు పోలీసులు. చిన్న పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేసేవాళ్లను చంపేయాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది బాలిక తల్లి. కూతురు వరసైన మరొక మైనర్ బాలికపై కూడా బాబీ లైంగిక దాడి చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. పిఈటిగా చేస్తూనే ఓ రాజకీయ పార్టీలో కూడా బాబీ యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
మనవరాలి వయసున్న 8వ తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కీచకుడి ఉదంతం ఇటీవల రాష్ట్రంలో కలకలం సృష్టించింది. నిందితుడు తాటిక నారాయణరావు (62) పోలీసుల కస్టడీలో ఉండగా ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. తుని రూరల్ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను తాతనని చెప్పి హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లిన నారాయణరావు, నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.తోటలో ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి పోలీసులకు అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో తుని శివారులోని కోమటిచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us