Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. యువతిని చిదిమేసిన ఆర్టీసీ బస్సు!

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కొత్తగూడ సర్కిల్‌లో ఆర్టీసీ బస్సు యువతిపైకి దూసుకెళ్లింది. చౌరస్తాలో రోడ్డు దాటుతున్న యువతిని వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ప్రమాద వీడియో వైరల్ అవుతోంది.

New Update
Accident

Hyderabad: దేశవ్యాప్తంగా వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. జాతీయ రహాదారులపైనే కాదు జనాలు రద్దీగా ఉంటే ప్రాంతాల్లోనూ బస్సు, లారీ, కారు డ్రైవర్ల నిర్లక్ష్యంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు ఇటీవల లెక్కకు మించి జనాల ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా యువకులను టైర్ల కింద నలిపేస్తున్నాయి. ఇటీవలే యూసఫ్ గూడలో ఓ కాలేజీ అమ్మాయి ఆర్టీసీ బస్సు వెనకటైర్ల కిందపడి దుర్మరణం చెందగా.. తాజాగా మాదాపూర్ కొత్తగూడ సర్కిల్ లోనూ మరో యువతిని బస్సు బలితీసుకుంది.

ఈ దారుణమైన ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని కొత్తగూడ సర్కిల్‌లో ఆర్టీసీ బస్సు యువతిపైకి దూసుకెళ్లింది. చౌరస్తాలో రోడ్డు దాటేందుకు వెళ్తున్న యువతిని వెనకనుంచి వచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో సదరు యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. డ్రైవర్‌ ఆమెను గమనించకపోవడంతో బస్సు ఆమెపై నుంచి దూసుకెళ్లడం సీసీటీవీ పుటేజీలో రికార్డైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిదంటూ తిట్టిపోస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. యువతికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు