రైతుకు తెలీకుండానే రూ.20 లక్షల లోన్.. బ్యాంకుకెళ్లి చూస్తే?

ఓ రైతుకు తెలియకుండానే అతడి పేరుతో బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. ఏడు బ్యాంకుల్లో రైతు పేరుతో రూ.20 లక్షలు లోన్ తీసుకున్నారు. బాధితుడు పంట రుణం కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

fdvd
New Update

టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి మోసాలు ఎక్కువై పోతున్నాయి. ఈ కంప్యూటర్ యుగంలో సైబర్ నేరగాళ్లు అమాయకులను క్షణాల్లో మోసం చేస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి.  ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని యూజ్ చేసుకొని అమాయకుల అకౌంట్స్ నుంచి డబ్బులు దోచుకొంటున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుంచి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ కొత్త తరహా మోసం బయటపడింది.

ఏడు బ్యాంకుల్లో రూ.20 లక్షలు..

ఓ రైతుకు తెలియకుండానే అతని పేరుతో బ్యాంకులో లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి బ్యాంకులనే బురిడీ కొట్టించారు. అలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏడు బ్యాంకుల్లో రైతు పేరుతో రూ.20 లక్షలు లోన్ తీసుకున్నారు. ఇక ఆ రైతు  పంట రుణం కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు రైతు పోలీసులను ఆశ్రయించాడు. 

Also Read :  ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన ముంజల నారాయణ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు అతని ఆధార్ కార్డును ఉపయోగించి మోసానికి పాల్పడ్డారు. నారాయణ ఆధార్ కార్డుపై ఫోటోను మార్చి ఫేక్ పాన్‌కార్డు సృష్టించారు. పాన్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డు ద్వారా హైదరాబాద్ నగరంలోని ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుంచి 2018లో రూ.20 లక్షల లోన్ తీసుకున్నారు. ఇప్పటివరకు రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. 

Also Read: నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది

అయితే గత కొ న్ని రోజులుగా నారాయణకు బ్యాంకు నుంచి డబ్బులు చెల్లించాలని కాల్స్ వస్తుండగా.. అవి సైబర్ కాల్స్ అని భావించి వదిలేశాడు. కాగా ఇటీవల తన వ్యవసాయ భూమిపై లోన్ తీసుకునేందుకు నారాయణ బ్యాంకుకు వెళ్లగా.. అక్కడ అసలు విషయం తెలిసింది. నారాయణ ఆధార్ కార్డు, పాన్ కార్డు చెక్ చేయగా..ఇప్పటికే లోన్ ఉందని, ఆ డబ్బులు చెల్లించకుండా కొత్తగా లోన్ ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెప్పారు. 

Also Read: డ్రోన్ మార్కెట్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్, వారికిదే ఛాలెంజ్: చంద్రబాబు

దీంతో ఖంగుతున్న నారాయణ.. తనకు బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా ఆరా తీశాడు. బ్యాంకులకు వెళ్లి చూడగా.. అక్కడ ఆధార్ కార్డులో నెంబర్ మాత్రం నారయణదే కానీ ఫోటో మాత్రం మార్ఫింగ్ చేశారు. దీంతో నారాయణ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: అన్ స్టాపబుల్ లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన.. బాలయ్య, చంద్రబాబు మధ్య హాట్ డిస్కషన్?

#cyber-crime #cyber crime karimnagar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe