ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, బస్సు ఢీకొని 40 మంది..

ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సర్కారు తోపు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. 40 మందికి తీవ్ర గాయాలవగా క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పలువురికి విషమంగా ఉన్నట్లు సమాచారం.

New Update
sewt

Accident: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం సర్కారు తోపు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందగానే ఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కాలేజీ స్టూడెంట్స్ ఉండగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను జేసీబీ సాయంతో బటయకు తీశారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కడప జిల్లాలో పెను ప్రమాదం..

కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సు మంగళవారం ఉదయం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది.  ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కొగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.  మరికొందరు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయట పడ్డారు.ఈ ఘటన కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని జంగంపల్లె వద్ద చోటుచేసుకుంది.  ప్రమాదానికి గురైన బస్సు ప్రగతి జూనియర్ కాలేజీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్..

ఈ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న  డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులుకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు నిబంధనల మేరకు బస్సుకు ఫిట్‌నెస్‌ ఉందా?, లేదా ప్రమాదానికి గల కారణం ఏంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు