చేతులకు కట్లు కట్టి.. పోలీసులను బురిడీ కొట్టింటిన యువతి

ఢిల్లీ యూనివర్సిటీ (DU)లోని ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలు కల్పితమని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. దర్యాప్తులో భాగంగా, బాధితురాలుగా చెప్పుకున్న విద్యార్థిని కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

New Update
Delhi University

ఢిల్లీ యూనివర్సిటీ (DU)లోని ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలు కల్పితమని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. దర్యాప్తులో భాగంగా, బాధితురాలుగా చెప్పుకున్న విద్యార్థిని కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అసలు అలాంటి ఘటనే జరగలేదని పోలీసులు ధృవీకరించారు. కొద్ది రోజుల క్రితం, ఒక యువతి తనపై యాసిడ్ దాడి జరిగిందని, గుర్తు తెలియని వ్యక్తులు తనపై కెమెకల్స్ చల్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఢిల్లీలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు సంఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే, విద్యార్థిని ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో అనుమానాలు గుర్తించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన తర్వాత, యాసిడ్ దాడికి సంబంధించిన సంఘటన నిజం కాదని పోలీసులు నిర్ధారించారు. యువతి యాసిడ్ దాడి కథను కల్పించి పోలీసులను, ప్రజలను తప్పుదోవ పట్టించిందని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల లేదా ఇతరులపై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఆమె ఈ అబద్ధాన్ని సృష్టించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అబద్ధపు ఫిర్యాదు చేసి, సమయాన్ని వృథా చేసినందుకు ఆ విద్యార్థినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇటువంటి తప్పుడు ఫిర్యాదుల కారణంగా నిజమైన బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు