/rtv/media/media_files/2025/07/04/search-2025-07-04-20-16-33.jpg)
కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో 24 ఏళ్ల లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణమైన అత్యాచార ఘటనను నిందితులలో ఒకరు చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఘటనపైన అయ్యో పాపం అంటూ మానవత్వా్న్ని ప్రదర్శించాల్సింది పోయి నెటిజన్లు ఈ రేప్ ఘటనకు సంబంధించిన వీడియో కోసం గూగుల్లో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ వీడియో ఫుటేజ్ కోసం సెర్చింగ్ పదేపదే పెరిగాయని గూగుల్ ట్రెండ్స్ డేటా సూచిస్తుంది. కోల్‌కతా లా స్టూడెంట్ అత్యాచారం కేసు కోసం నెటిజన్లు “సెక్స్”, “ఎంఎంఎస్”, “పోర్న్” “రేప్ పోర్న్” వంటి సెర్చింగ్ పదాలను ఉపయోగించారు.
కోల్‌కతా గ్యాంగ్‌రేప్ పోర్న్ తో
సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత జూన్ 29న అటువంటి ఫుటేజ్ కోసం వెతుకుతున్న పదాల కోసం సెర్చింగ్ వాల్యూమ్‌లు పెరిగాయి. “కోల్‌కతా గ్యాంగ్‌రేప్ పోర్న్” అనే వర్డ్ తో కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు. ఇండియాలో ఇలా జరగడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు.. 2012లో జ్యోతి సింగ్ పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య తర్వాతి రోజుల్లో, "ఢిల్లీ రేప్ పోర్న్" అనే వర్డ్ తో కోసం శోధనలు జరిగాయనని గూగుల్ ట్రెండ్స్ డేటా వెల్లడించింది. మార్చి 2012 వరకు గూగుల్ సెర్చింగ్ లో “ఢిల్లీ బస్ పోర్న్”, “ఢిల్లీ బస్ రేప్ వీడియో”, “ఢిల్లీ రేప్ వీడియో” వంటి పదాల సెర్చింగ్ ఎక్కువగా ఉంది.