Pastor Praveen: ప్రభుత్వంపై నమ్మకం ఉంది.. ప్రవీణ్ మృతిపై భార్య సంచలన వీడియో!

ప్రవీణ్‌ భార్య జెస్సీకా మీడియాతో మాట్లాడారు. తన భర్త మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంది. ప్రభుత్వంపై పూర్తి నమ్మకముందని జెస్సికా చెప్పారు. దర్యాప్తు అయ్యేంత వరకు సంయమనం పాటించాలని కోరింది. ప్రవీన్ మరణం రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

New Update

పాస్టర్ ప్రవీణ్ మరణంపై మొదటిసారి ఆయన భార్య జెస్సీకా పగడాల మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. జెస్సీకా ఆర్టీవితో మాట్లాడుతూ.. ప్రవీణ్ మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ప్రవీణ్ గురించి సోషల్ మీడియాలో చూపిస్తున్న వీడియోలు ఆయన ప్రతిష్ఠని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

ఈ కేసు విచారణలో ప్రభుత్వం, పోలీసులపై మాకు పూర్తి నమ్మకముందని ప్రవీన్ భార్య జెస్సీకా అన్నారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్‌లో ఏదో ఒకటి తేలేవరకు క్రైస్తవులందరూ సంయమనం పాటించాలని ఆమె కోరారు. ప్రవీణ్ మరణాన్ని కొందరు కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆమె అన్నారు. క్రైస్తవ సోదరీ, సోదరీమణుల నుంచి వస్తున్న మద్దతుకు జెస్సీకా ధన్యవాదాలు చెప్పారు.

Also read: Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు