AP Crime: పల్నాడులో రియల్ ఎస్టేట్ మర్డర్.. తండ్రీకొడుకులను నరికి నరికి!

ల్నాడు జిల్లాలో పట్టపగలే తండ్రకొడుకులను దారుణంగా హత్య చేశారు. వీరిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

New Update

AP Crime: ఈ మధ్య సమాజంలో నేరాలు, ఘోరాలు సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆస్తులు,  పగప్రతీకారాల కోసం మనుషులు ప్రాణాలు తీసేవరకు దిగజారుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే పల్నాడులో వెలుగుచూసింది. వ్యాపారంలో విభేదాలతో పట్టపగలే తండ్రీకొడుకులను నరికి నరికి చంపారు భాగస్వాములు! వివరాల్లోకి వెళితే..   బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన తండ్రీకొడులు  ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి చాలా ఏళ్లుగా బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే  ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు తలెత్తాయి. వీరిద్దరి పై భాగస్వామి గడ్డం అనిల్ కుమార్ రెడ్డి ఒంగోలు, అద్దంకి, నరసరావుపేటలో చెక్‌ బౌన్స్ కేసులు పెట్టాడు. 

Also Read:Happy50 Suriya: మీ ఫేవరేట్ హీరో సూర్య గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలివే!

తండ్రీకొడుకును నరికి నరికి 

ఈమేరకు బుధవారం కేసు వాయిదా నిమిత్తం  నరసారావు పేట కోర్టులో హాజరయ్యేందుకు వచ్చారు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి. ఇంతలోనే దారుణం జరిగింది.  ప్రశాంత్ రెడ్డి, అతడి కొడుకు వీరాస్వామి రెడ్డి కోర్టు సమీపంలోని ఓ హోటల్ లో టిఫిన్ చేసి వస్తుండగా కొందరు దుండగులు వారిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ఓ ప్రైవేట్ వెంచర్‌లోకి దారుణంగా హత్య చేశారు. పగ ప్రతీకారంతో ప్రశాంత్  రెడ్డి భాగస్వాములే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి  విచారిస్తున్నారు.

Also Read: Vijay Antony Bhadrakali Movie: విజ‌య్ ఆంటోని బర్త్ డే స్పెషల్.. కేక్ కి బదులు ఏం కట్ చేశారో చూడండి..!

Advertisment
తాజా కథనాలు