ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. బాంద్రా నుంచి యూపీలోని గోరఖ్‌పుర్ వెళుతున్న రైలులో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త!
దీపావళి పండుగ నేపథ్యంలో..
దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లడానికి ప్రయాణికులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. పండుగ దగ్గర కావడం వల్ల ఇంటికి వెళ్లే వారి సంఖ్య పెరగడంతో స్టేషన్ రద్దీగా మారింది. బాంద్రా నుంచి గోరఖ్‌పూర్ బయలు దేరే ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లో ఉంది. ఈ రోజు ఉదయం 5.56 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ
ఇంటికి వెళ్లాలనుకునే ప్రయాణికులు ఈ ట్రైన్ ఎక్కే సమయంలో రద్దీ కారణంగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), రవీంద్ర హరిహర్ చుమా (30), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (18), సంజయ్ తిలక్రం కాంగే (27), మహ్మద్‌లు, ఇంద్రజిత్ సహాని (19), షరీఫ్ షేక్ (25),నూర్ మహ్మద్ షేక్ (18)లు గాయపడినట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు