VIDEO: భర్తకు షాకిచ్చిన 9 మంది పిల్లల తల్లి.. డబ్బు, నగలు తీసుకుని ప్రియుడితో జంప్

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 52 ఏళ్ల మహిళ తన భర్త, 9 మంది పిల్లలను వదిలి 32 ఏళ్ల వ్యక్తితో పారిపోయింది. తనతో పాటు 10 ఏళ్ల కూతురిని, రూ.4 లక్షల విలువైన నగలు, రూ.50,000 నగదు, భూమి పత్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమెకు మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు.

New Update
mother of nine children runs away with lover

mother of nine children runs away with lover

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిది మంది పిల్లల తల్లి అయిన 52 ఏళ్ల మహిళ తన భర్త, పిల్లలను వదిలి 32 ఏళ్ల వ్యక్తితో పారిపోయింది. ఆ మహిళ తన 10 ఏళ్ల కుమార్తెను తనతో తీసుకెళ్లడమే కాకుండా, ఇంట్లో ఉంచిన లక్షల విలువైన నగలు, నగదు, భూమి పత్రాలను కూడా తనతోపాటు తీసుకెళ్లింది. ఈ సంఘటన మొత్తం ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

mother of nine children runs away with lover

ఉసిహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖేడా జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓంపాల్ అనే వ్యక్తి, నీలం అనే మహిళను పెళ్లి చేసుకుని 32 సంవత్సరాలు అవుతుంది. ఈ దంపతులకు 9 మంది సంతానం. వీరిలో 5 మంది కుమార్తెలు, 4 మంది కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు 21 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మరణించాడు. మరో ముగ్గురు కుమార్తెలకు, ఒక కుమారుడికి వివాహం చేశారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. 

భర్త ఓంపాల్ ఢిల్లీలో కూలీగా పనిచేసేవాడు. అతడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. గ్రామంలో అతడి భార్య నీలం తన పిల్లలతో పాటు వ్యవసాయ పనులు చూసుకునేది. ఇలా వారి కుటుంబం కొంతకాలం బాగానే ఉంది. అయితే ఒకసారి నీలం ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండటం భర్త ఓంపాల్ చూశాడు. ఆ సమయంలో అతడు ఆమెను ప్రశ్నించాడు. కానీ ఆమె ఏం చెప్పకుండా తప్పించుకుంది. చివరికి ఆమె అదే గ్రామానికి చెందిన పప్పు యాదవ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయినట్లు అతడికి తెలిసింది. 

అనంతరం భర్త ఓంపాల్ ఎమోషనల్ అయ్యాడు. ‘‘నా 32 ఏళ్ల వైవాహిక జీవితం నాశనం అయింది. కుటుంబాన్ని పోషించడానికి నేను చాలా కష్టపడ్డాను. పిల్లలను పెంచాను. నా భార్య పేరు మీద నాలుగు ఎకరాల భూమిని కూడా కొన్నాను. కానీ ఆమె అన్నింటినీ వదిలేసి ఆ సంబంధాన్ని తెంచుకుంది’’ అని  భర్త ఏడుస్తూ మాట్లాడాడు. 

కాగా ఆ మహిళ తనతో పాటు 10 ఏళ్ల కూతురిని, రూ.4 లక్షల విలువైన నగలు, రూ.50,000 నగదు, భూమి పత్రాలను తీసుకెళ్లిందని భర్త ఆరోపించాడు. పంట అమ్మిన తర్వాత ఆ నగదును ఇంట్లో ఉంచానని బాధపడ్డాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళ, ఆమె ప్రేమికుడిని కాస్గంజ్ జిల్లాలోని బహేడియా గ్రామంలో పట్టుకున్నారు. ఆ సమయంలోనే భర్త ఓంపాల్ తన భార్యతో మాట్లాడాడు. జరిగినదంతా మరిచిపోయి తిరిగి ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాడు. కానీ ఆమె అంగీకరించలేదు.

ఆ తర్వాత వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆ మహిళ తన భర్త, పిల్లల వద్దకు తిరిగి వెళ్లనని చెప్పింది. ఆమె తన ఇష్టానుసారంగానే తన ప్రియుడు పప్పుతో కలిసి జీవించాలనుకుంటున్నానని చెప్పింది. తన 10 ఏళ్ల కుమార్తెను తనతోనే ఉంచుకోవాలనే కోరికను కూడా ఆమె వ్యక్తం చేయగా.. దానికి కోర్టు అంగీకరించింది. ఇప్పుడీ ఘటన ఆ గ్రామం, పరిసర ప్రాంతాలలో చర్చనీయాంశంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు