హైదరాబాద్‌లోని నార్సింగిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నారి కూతురితో కలిసి తల్లి నివసించే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మానస అనే మహిళ తన భర్త, కూతురుతో కలిసి నార్సింగిలోని మై హోమ్ అవతార్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. అనుమానాస్పదంగా అపార్ట్‌మెంట్ 18వ ఫ్లోర్ నుంచి కూతురుతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీకూతురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఇది కూడా చూడండి: వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
కుటుంబ కలహాల కారణంగా..
మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలం నుంచి భర్తతో గొడవలు ఉన్నాయని పోలీసులు విచారణలో తెలిపారు. కుటుంబ కలహాల వల్ల కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే?