అత్యంత పాశవికంగా హత్య చేశారు.. పోలీసులపై మావోయిస్టుల సంచలన లేఖ

అబూజ్‌మడ్ ఎన్ కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో గాయపడిన 17 మందిని భద్రతాబలగాలు అత్యంత పాశవికంగా ఊచకోత కోశాయని తెలిపింది. ప్రజలు, ప్రజాసంఘాలు, మీడియా దీనిని ఖండించాలని కోరింది. మృతుల వివరాలు వెల్లడించింది.

author-image
By srinivas
dsre
New Update

Maoist letter: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం అబూజ్‌మడ్ ఎన్ కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. L- ఫార్మేషన్‌లో ఊచకోత కోశారంటూ విస్తుగొలిపే సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ మేరకు తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ పేరిట విడుదల చేసిన లేఖలో మొత్తం 35 మంది సహచరులను కోల్పోయినట్లు వెల్లడించింది. నారాయణపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు తుల్తులి గ్రామ సమీపంలోని అడవుల్లో కాల్పులు జరిగినట్లు తెలిపింది. L- ఫార్మేషన్ లో దిగ్భందిస్తూ ఉదయం 11:30 నిమిషాల నుంచి రాత్రి 9గంటల వరకు మొత్తం 11 సార్లు భద్రతాబలగాలు తమపై కాల్పులు జరిపాయని లేఖలో పేర్కొంది. 

publive-image

గాయపడినవారిని ఊచకోత..

అక్టోబర్ 4వ తేదీన భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 14 మంది తమ సహచరులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన 17 మందిని పట్టుకున్న భద్రతాబలగాలు మరుసటి రోజు ఉదయం 8గంటలకు ఊచకోత  అత్యంత పాశవికంగా ఊచకోత కోశాయి. అబూజ్ మడ్ ఎన్ కౌంటర్‌ను ఖండిస్తూ ప్రతి ఒక్కరూ గళం విప్పాలి. అన్ని వర్గాల ప్రజలకు, ప్రజాసంఘాలు ఖండించాలి. ఎన్ కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులకు నివాళుల ప్రకటన ఇవ్వాలి. అలాగే ఈ ఘటనపై న్యాయ విచారణ జరిగేలా.. నిజాలేంటో బయటి ప్రపంచాన్ని తెలియజేసేలా సామాజిక సంస్థలు, మీడియా ప్రతినిధులు పోరాటం చేయాలంటూ మావోయిస్టు పార్టీ కోరింది. 

publive-image

చరిత్రలోనే అత్యంత భారీ నష్టం.. 


2024 అక్టోబర్ 4న మావోయిస్టు పార్టీకి చరిత్రలోనే అత్యంత భారీ నష్టం జరిగింది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 36  మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి భద్రతాబలగాలు. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడగా నలుమూలలా చుట్టుముట్టిన స్పెషల్ పార్టీస్ ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు, దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కల్లపల్లి వాసుదేవరావు ఉన్నట్లు సమాచారం. కాగా 2026 మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో బలగాలు అడవులను జల్లడపడుతున్నాయి.

publive-image

#encounter #maoist #Operation Abujhmad Plan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe