TG Crime : మంచిర్యాలలో ముదనష్టపు లవర్.. బాగా వాడుకుని ఫోటోలు బయటపెడతానంటూ

మంచిర్యాల జిల్లాలోని భగవంతవాడలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ముందే వరకట్న వేధింపులతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో అనూషను మోసం చేశాడు శ్రీకాంత్‌. నాలుగు సంవత్సరాలుగా అనూషకు, శ్రీకాంత్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

New Update

మంచిర్యాల జిల్లాలోని భగవంతవాడలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ముందే వరకట్న వేధింపులతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో అనూషను మోసం చేశాడు శ్రీకాంత్‌. నాలుగు సంవత్సరాలుగా అనూషకు, శ్రీకాంత్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కులాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి పెద్దల నిరాకరించారు. అయితే డబ్బులు, నగలు ఇస్తే తానే పెళ్లి చేసుకుంటానన్నాడట శ్రీకాంత్‌.  తనను కాదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే..వారిద్దరి సన్నిహిత ఫోటోలు బయటపెడతానంటూ శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో శ్రీకాంత్‌ మోసం చేశాడన్న మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని అనూష ప్రాణాలు తీసుకుంది. అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ఒక్క కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. అనూషను శ్రీకాంత్‌ తరుచూ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకాంత్ అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీఐ ప్రమోద్ తెలిపారు. 

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. బడంగ్ పేట్ లోని లక్ష్మీదుర్గకాలనీకి చెందిన విశాల్(25) కు 2025 ఆగస్టు 07వ తేదీన పెళ్లి అయింది.  తెల్లవారుజామున వధువుతో కలిసి ఇంటికి చేరుకోగానే అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుసత్రికి తరలించారు.అక్కడ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విశాల్ కన్ను్మూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికంగా ఈ ఘటన అందర్ని కలిచివేసింది. అటు మెదక్ జిల్లా అంసాన్‌పల్లి గ్రామంలో ఒక 22 ఏళ్ల వరుడు పెళ్లైన రెండు వారాల తర్వాత గుండెపోటుతో మరణించాడు. సాయికిరణ్ అనే ఆ యువకుడు పెయింటర్‌గా పని చేసేవాడు. స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లినప్పుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. 

Advertisment
తాజా కథనాలు