నిన్ను సంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య! కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్తను కూరగాయల కత్తితో పొడిచిన ఘటన ఖమ్మం జిల్లా గొళ్లపూడిలో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న లక్ష్మి భర్త రవి విసిగిస్తున్నాడే కోపంతో పొడిచింది. రవిని ఆస్పత్రికి తరలించి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 29 Nov 2024 in క్రైం ఖమ్మం New Update షేర్ చేయండి khammam: ఖమ్మం జిల్లా వైరాలో ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. తన భర్తను కూరగాయల కత్తితో కడుపులో క్రూరంగా పొడిచింది. తప్పించుకుని ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తిన వదలకుండా పలుచోట్ల గాయపరిచింది. ఈ ఘోరాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ భయంకరమైన ఘటన వైరా మండలం గొళ్లపూడి గ్రామంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 18 సార్లు పుట్టింటికి వెళ్లిపోయిన లక్ష్మి.. ఈ మేరకు ఆరేళ్లక్రితం వైరా మండలం గొల్లపూడికి చెందిన పొరల రవికి అదే మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన లక్ష్మికి వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు. ఇక స్థానిక ఓప్రైవేటు పాఠశాలలో లక్ష్మి టీచర్ గా పనిచేస్తోంది. మొదట్లో సజావుగానే సాగిన ఈ కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భర్త రవి తరచూ మానసికంగా హింసిస్తూ గొడవపడుతుండటంతో భార్య లక్ష్మి విసిగిపోయింది. ఇరువురి మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. దీంతో ఆమె ఇప్పటి వరకూ 18 సార్లు పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు పంచాయతీ పెట్టించి తిరిగి తీసుకొచ్చారు. అయితే శుక్రవారం తెల్లవారు జామున భర్త రవితో వాగ్వాదానికి దిగిన భార్య లక్ష్మీ.. తీవ్రకోపంతో కూరగాయల కత్తితో పలుచోట్ల పొడిచింది. భార్య లక్ష్మి దాడి నుంచి తప్పించుకుని బయటకు పరుగెత్తాడు రవి. తీవ్రరక్త స్రావంతో ఉన్న రవిని గమనించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాధు మేరకు దాడికి పాల్పడిన లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తన భార్య వేధింపులు భరించలేకపోతున్నానని తనకు విడాకులిప్పించి న్యాయం చేయాలని రవి కోరుతున్నాడు. #khammam #wife #ravi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి