ఖమ్మంలో దారుణం.. 20 ముక్కలుగా మహిళను కట్ చేసి ఏం చేశాడంటే?

సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఖమ్మంలోని ఓ దంపతుల నుంచి స్వాతి, వీరభద్రం రూ.16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో స్వాతి వారి డబ్బులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. కానీ వీరభద్రానికి ఇష్టం లేక స్వాతిని 20 ముక్కలుగా కట్ చేసి చంపి పొలంలో విసిరాడు.

New Update
crime,

కేక్ పీస్‌ను కట్ చేసినట్లు ఓ మహిళ బాడీని ముక్కలుగా కట్ చేసి పొలంలో వేసిన దారుణ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూలూరుపాడు మండలంలో పార్వతి, రత్న కుమార్ అనే దంపతులు ఉంటున్నారు. సింగరేణిలో ఉద్యోగం కోసం కోసం వీరభద్రం, స్వాతి అనే వారికి రూ.16 లక్షలు ఇచ్చారు. ఎలా అయిన సింగరేణిలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇవ్వడంతో పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు.

ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!

వడ్డీలు కట్టలేక..

ఉద్యోగం రాకపోవడంతో అప్పు చేసిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోయాయి. ప్రతీ నెల కూడా వడ్డీ కట్టలేక రత్న కుమార్, పార్వతి దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో స్వాతి తమ డబ్బులు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ స్వాతి ఆ డబ్బులు వీరభద్రానికి ఇచ్చింది. అంత పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బును చూసిన వీరభద్రం తిరిగి ఇవ్వడానికి ఇష్టపెట్టుకోలేదు.

ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్‌-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!

స్వాతిని కిడ్నాప్ చేసి హతమార్చితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వక్కర్లేదని వీరభద్రం భావించాడు. డబ్బులు ఇస్తానని నమ్మించి ఆమెను కిడ్నాప్ చేసి ఎవరూ గుర్తు పట్టకూడదని 20 ముక్కలుగా చేసి హతమార్చాడు. ఆ ముక్కలు అన్నింటిని కూడా పొలంలో వేశాడు. గత కొన్ని రోజుల నుంచి స్వాతి కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమె కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!

ఈక్రమంలోనే పొలం దగ్గర మహిళ మృతదేహం ముక్కలతో ఉందని పోలీసులకు ఓ రైతు నుంచి కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ముక్కలుగా ఉన్న మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పరిశీలించారు. ఆ ముక్కలైన మృతదేహం స్వాతిదని, వీరభద్రమే ఇలా చేశాడని పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు