pregnant Job : నన్ను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 25లక్షలు ఇస్తా.. నెంబర్ ఇదే!

ఆ ప్రకటనలో ఓ మహిళ..  నన్ను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన  పురుషుడు కావాలి. నేను  గర్భవతిని చేస్తే రూ. 25 లక్షలు ఇస్తాను. అతను నిరక్షరాస్యుడైనా, ఏ కులానికి చెందినవాడైనా, అందంగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పింది.

New Update
pregnent job

ప్రతి చిన్న పనికి ఇంటర్నెట్‌పై ఆధారపడే ఈ రోజుల్లో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో సోషల్ మీడియాలో వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను నమ్మి 44 ఏళ్ల ఓ కాంట్రాక్టర్ ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఆ ప్రకటనలో ఓ మహిళ..  నన్ను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన  పురుషుడు కావాలి. నేను  గర్భవతిని చేస్తే రూ. 25 లక్షలు ఇస్తాను. అతను నిరక్షరాస్యుడైనా, ఏ కులానికి చెందినవాడైనా, అందంగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పింది. ఆసక్తి ఉన్నవారు ఈ  ఫోన్ నంబర్‌ను సంప్రదించాలంటూ ఈ వీడియోలో నెంబర్ కూడా షేర్ చేసింది. దీంతో దీనికి అట్రాక్ట్ అయిపోయిన ఆ కాంట్రాక్టర్ వెంటనే ఆ నంబర్‌కు కాల్ చేశాడు. అప్పుడు తాను 'ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ'లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని చెప్పుకున్న ఒక వ్యక్తి కాల్ అందుకున్నాడు.

రూ. 11 లక్షల వరకు డబ్బు బదిలీ

మహిళతో కలిసేందుకు ముందుగా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కంపెనీ ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని సూచించాడు. ఆ తరువాత, మోసగాళ్లు ఆ కాంట్రాక్టర్‌ను రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు ఫీజు, జీఎస్టీ , టీడీఎస్,  ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక రకాల ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారు. ఆ కాంట్రాక్టర్‌ సెప్టెంబర్ మొదటి వారం నుండి అక్టోబర్ 23 వరకు, 100 కంటే ఎక్కువ సార్లు చిన్న చిన్న మొత్తాలలో మొత్తం రూ. 11 లక్షల వరకు డబ్బు బదిలీ చేశాడు. 

ఈ బదిలీలన్నీ యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా జరిగాయి. ఎంత డబ్బు పంపినా పని పూర్తి కాకపోవడంతో, బాధితుడు వారిని ప్రశ్నించడం ప్రారంభించాడు. దీంతో మోసగాళ్లు వెంటనే అతని నంబర్‌ను బ్లాక్ చేశారు. అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన కాంట్రాక్టర్ పుణెలోని బనేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ మోసంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లు, బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు