Guntur incident: గుంటూరు జిల్లాలో ఓ మహిళను సినిమా లెవెల్లో హత్య చేయించాడు భర్త. భార్యను హత్య చేయించడానికి ఏకంగా 15 లక్షలు ఖర్చు చేశాడు. భార్య పై క్షుద్రపూజలు చేయించడానికి ఢిల్లీ నుంచి క్షుద్రపూజారిని రప్పించాడు. ఈ దారుణమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే గత నెల 28న మల్లిక అనే మహిళ హత్యకు గురైంది. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించగా.. ఆమె మెడపై గాయాలు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. Also Read: Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు భార్య పై క్షుద్రపూజలు చేయించి.. 2021లో మల్లికకు రెహ్మాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ క్రమంలో మల్లిక రెహ్మాన్ ని వదిలేసి నాగబాబు అనే వ్యక్తికి దగ్గరైంది. అంతేకాదు ఇకపై నాగబాబుతోనే ఉంటానని రెహ్మాన్ కి తేల్చి చెప్పింది. దీంతో తట్టుకోలేకపోయిన రెహ్మాన్ ఎలాగైనా మల్లికను వశవపరుచుకోవాలని ప్లాన్ వేశాడు. అందుకోసం ఢిల్లీ నుంచి క్షుద్రపూజరిని రప్పించాడు. వశీకరణం చేసినప్పటికీ మల్లిక మారకపోవడంతో భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు రెహ్మాన్. ప్లాన్ ప్రకారం హత్య చేయడానికి ప్రకాశం జిల్లాకు చెందిన రసూల్, గుంటూరుకు చెందిన స్వప్న, క్షుద్రపూజారితో చేతులు కలిపాడు. నలుగురు కలిసి గత నెల 28న మల్లికను హత్య చేశారు. ఈ విషయం దర్యాప్తులో బయటపడడంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్