AP Crime : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్!

ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే  కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.

New Update
road accident

ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే  కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. మృతులను కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు (65), బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు.

ఇక ఇదే కారులో ప్రయాణిస్తున్న 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు గాయపడ్డారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీలను పోస్టుమార్టంకు పంపించారు.  

భార్యాభర్తలు ఆత్మహత్య

మరోవైపు విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఆదివారం భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త ఫ్యానుకు ఉరి వేసువేసుకోగా.. భార్య చనిపోయి కింద పడి ఉంది. మృతులు వాసు, అనితగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మహిళ ఏడు నెలల గర్భవతిగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Advertisment
తాజా కథనాలు