ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సీపట్నానికి సమీపంలోని వెంకునాయుడుపేటలో కోటారి రమణ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జీవిస్తున్నాడు. ఇతనికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బులు అన్ని తీసుకుని దుబారా చేస్తుంటాడు. దీంతో ఆ తండ్రి కొడుకుతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కోపంతో అక్కడే ఉన్న రోకలితో కొడుకుని తండ్రి రమణ కొట్టాడు. ఆ దెబ్బల దాటికి కొడుకు అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్
మహారాష్ట్రలో కూడా..
ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని ఓ వ్యక్తి కిరాచకంగా ప్రవర్తించాడు. పర్భాని జిల్లా గంగాఖేడ్ నాకాలో కుండ్లిక్ ఉత్తమ్ కాలే (32) అనే వ్యక్తి భార్య మైనాను గురువారం రాత్రి నిప్పటించి చంపేశాడు. మైనా సోదరి చెప్పిన వివరాల ప్రకారం.. ఉత్తమ్ భార్య మైనాకు వరుసగా ఇద్దరు కూతుళ్ళ తర్వాత మూడోసారి కూడా కూతురే పుట్టింది. ముగుర్రు కుమార్తెలు కావడంతో ఉత్తమ్ తరచూ భార్యను అసహ్యించుకోవడం ఆమెతో గొడవపడటం చేసేవాడు.
ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!
కాగా.. గురువారం రాత్రి వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన ఉత్తమ్ భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మైనా కేకలు వేస్తూ ఇంటి బయటకు వెళ్ళింది. వెంటనే స్థానికులు మంటలు ఆర్పీ ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్రంగా కాలిపోవడంతో మార్గం మధ్యలోనే మరణించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు కాలేను అరెస్టు చేసి గంగాఖేడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది కూడా చూడండి: AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..
ఇది కూడా చూడండి: ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్‌డౌన్