తమిళనాడులో మరోసారి భయంకరమైన పేలుడు

తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. అనేక మంది గాయపడ్డారు. శివకాశి-సత్తూరు రోడ్డు పక్కన ఉన్న గోకుల్స్ బాణసంచా దుకాణంలో ఈ పేలుడు సంభవించింది.

New Update
factory in Tamil Nadu

తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. శివకాశి-సత్తూరు రోడ్డు పక్కన ఉన్న గోకుల్స్ బాణసంచా దుకాణంలో ఈ పేలుడు సంభవించింది.

సంఘటన జరిగిన సమయంలో 50 మందికి పైగా కార్మికులు అక్కడ ఉన్నారని, ఏడు పని చేసే షెడ్‌లు పేలుడులో పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.

జూలై 1న జరిగిన మరో పేలుడులో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు