Diwali 2025: షాకింగ్ వీడియోలు.. పండుగరోజు విషాదాలు - వణుకు పుట్టిస్తున్న విజువల్స్

దివాళీ పండుగ రోజు కొందరి ఇళ్లలో ఆనందం కాస్త విషాదంగా మారింది. చిన్న నిప్పురవ్వ ఎంతో మందికి గూడు లేకుండా చేసింది. టపాసులు కాల్చిన సందర్భంలో ఎన్నో ఇళ్లు నిప్పురవ్వకు దగ్ధమయ్యాయి. అదే సమయంలో పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో బైక్ లు సైతం కాలి బూడిదయ్యాయి.

New Update
diwali 2025 fire breaks out

diwali 2025 fire breaks out

దీపావళి పండుగను ప్రజలు నిన్న (అక్టోబర్20) అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇళ్లల్లో దివ్వెల కాంతులతో ఉత్సాహాంగా టపాసులు పేల్చుతూ సరదా సరదాగా గడిపారు. కానీ కొన్ని ఇళ్లలో ఆ ఆనందం ఎక్కువ సమయం నిలవలేదు. చాలా చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా ఎన్నో ఇళ్లు మంటల్లో దగ్దమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదాలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుందాం. 

హిమాచల్ ప్రదేశ్‌ లో దీపావళి రోజు ఘోరమైన అగ్రిప్రమాదం సంభవించింది.  కులులోని మణికరణ్ పర్వత లోయలో ఉన్న కసోల్‌లోని ఒక హోటల్‌లో దీపావళి రాత్రి మంటలు చెలరేగాయి. హోటల్ పై అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కసోల్‌లో పర్యాటకులు, స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మంటల వార్త వ్యాపించగానే ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. ప్రజలు పరుగులు తీస్తూ కేకలు వేశారు. హోటల్ పై అంతస్తులలో మంటలు చెలరేగడంతో.. దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

వెంటనే కులు జిల్లా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పర్యాటకులను సురక్షితంగా తరలించారు. అయితే కొందరు తమ వస్తువులను కోల్పోయినట్లు సమాచారం. 

పండ్ల మార్కెట్ అగ్నిప్రమాదం

దీపావళి రాత్రి డెహ్రాడూన్‌లోని నిరంజన్‌పూర్ మండిలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని సమాచారం. దీని కారణంగా మార్కెట్లో నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయలు, అనేక దుకాణాల వస్తువులు కాలిపోయాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాణసంచా పేలడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. అయితే పండ్లు, కూరగాయలు, దుకాణాల వస్తువులు సమీపంలోని దుకాణాలు బూడిదయ్యాయి. లక్షల్లో నష్టాలు సంభవించి ఉంటాయని అంచనా. 

బాణసంచా మార్కెట్‌లో మంటలు

ఉత్తరప్రదేశ్‌ ఫతేపూర్‌లోని బాణసంచా మార్కెట్‌లో మంటలు చెలరేగి 70 దుకాణాలు, 25 బైక్‌లు దగ్ధమయ్యాయి. ఒక నిప్పురవ్వతో ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించి, తొక్కిసలాటకు దారితీసి ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్నప్పటికీ, ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక వాహనంలో నీరు లేకపోవడం దారుణమని స్థానిక ప్రజలు, బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటన వల్ల జరిగిన నష్టం సుమారు ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 

Advertisment
తాజా కథనాలు