Dharmasthala case : ధర్మస్థల కేసులో సంచలన అప్డేట్‌..  రెండున్నర అడుగులు తవ్వగానే మహిళ మృతదేహం

ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  సైట్‌ నంబర్‌- 1లో తవ్వకాలు జరిపిన చోట కీలక ఆధారాలు లభించాయి.  రెండున్నర అడుగులు తవ్వగానే మహిళ మృతదేహం ఆనవాళ్లు లభ్యం అయ్యాయ.

New Update

ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  సైట్‌ నంబర్‌- 1లో తవ్వకాలు జరిపిన చోట కీలక ఆధారాలు లభించాయి.  రెండున్నర అడుగులు తవ్వగానే మహిళ మృతదేహం ఆనవాళ్లు లభ్యం అయ్యాయ. చిరిగిన రెడ్ జాకెట్‌ తో పాటుగా, పాన్ కార్డు, ATM లభ్యం అయ్యాయి.  అయితే పాన్ కార్డు, ATMలపై రెండు వేర్వేరు పేర్లున్నాయి. ఓ కార్డుపై మగవాళ్ల పేరు ఉండగా, మరో కార్డుపై లక్ష్మి అనే మహిళ పేరు ఉంది.  దీంతో ఆ ప్రాంతంలో మరింత లోతుగా తవ్వాలని నిర్ణయించారు సిట్ అధికారులు. అయితే ఈ వివరాలను ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడించలేదు.

13 ప్రదేశాలపై సిట్ విచారణ

1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలంలో అనేక మృతదేహాలను బలవంతంగా ఖననం చేశారని 50 ఏళ్ల మాజీ పారిశుధ్య కార్మికుడి ఆరోపణల మేరకు వాంగ్మూలాన్ని నమోదు చేశారు సిట్ అధికారులు. ఆ తర్వాత, సోమవారం ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయం, స్నాన ఘాట్ చుట్టూ ఉన్న శ్మశాన వాటికలుగా గుర్తించి 13 ప్రదేశాలపై సిట్ విచారణ నిర్వహించింది. ఈ ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కర్ణాటక ప్రభుత్వం 2025 జులై 19న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అంతర్గత భద్రతా విభాగం) ప్రణబ్ మొహంతి నేతృత్వంలో ఈ సిట్ పనిచేస్తోంది.

ఈ కేసులో 2012లో సంచలనం సృష్టించిన సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. సౌజన్య తల్లిదండ్రులు, ఇతర బాధిత కుటుంబాలు తమ పిల్లల అదృశ్యం లేదా మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసు కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే ధర్మస్థలలో ఇలాంటి భయంకరమైన ఆరోపణలు రావడంతో ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సిట్ దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే ఈ కేసులోని పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు