Janasena: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇక జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు IPC 376, 323, 506 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో ఢీ షో ద్వారా పరిచయం ఏర్పడినట్లు చెప్పిన బాధితురాలు.. ఓ రోజు ఫోన్ చేసి పిలిచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్లు తెలిపింది.
అయితే జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయినరోజు నుంచీ వేధింపులు మొదలయ్యాయని, ప్రతీసారి తన సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని బాధితురాలు వాపోయింది. అంతేకాదు కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ కూడా రానివ్వకుండా చేస్తానని బెదిరించాడు. షూటింగ్ జరుగుతున్న టైమ్‌లో నా వ్యాన్‌లోకి వచ్చి తన ప్యాంట్ జిప్ తీసి నాపై బలవంతం చేశాడు. నేను నో చెప్పేసరికి నా తలను అద్దంకేసి కొట్టాడు. మణికొండలోని నా ఫ్లాట్‌కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు నాపై దాడి చేశాడు. కానీ నేను ఏనాడు జానీ మాస్టర్‌కు లొంగలేదు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోండి’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది.