New Update
/rtv/media/media_files/2025/10/27/nlg-child-trafficing-2025-10-27-16-40-22.jpg)
నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు మరోసారి బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మా.. చెల్లిని అమ్మకు అంటూ కాళ్ల మీద పడి వేడుకున్న చిన్నారులు దృష్యాలు అందరి హృదాయాలను కదిలిస్తున్నాయి.
https://x.com/TeluguScribe/status/1982742996128076209
నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల దందా వెలుగులోకి వచ్చింది. గిరిజన దంపతులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పసి పిల్లలను అమ్మేందుకు సిద్ధమైయ్యారు. చెల్లిని అమ్మొద్దు అంటూ చిన్నారి సోదరి ఏడుస్తూ బతిమాలిన వీడియోలు బయటకు వచ్చింది.
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో నలుగురు ఆడ పిల్లలు ఉండగా, ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు(3, 4 ఏళ్లు) పిల్లలను గిరిజన దంపతులు అమ్ముతున్నారు. తల్లిదండ్రులు కొర్ర పార్వతీ–బాబు అనే దళారుల ద్వారా రూ.3 లక్షలకు గుంటూరు జిల్లాకు చెందిన వారికి అమ్మేశారు. ఈ క్రమంలో చెల్లిని అమ్మొద్దు అంటూ అక్క వేడుకునే తీరు చూసి కంటతడి పెట్టిన కుటుంబ సభ్యులు. నల్గొండ జిల్లాలో పేద, గిరిజన తండాలను టార్గెట్ చేసుకుని శిశు విక్రయాలకు పాల్పడుతున్న దళారులు.
తాజా కథనాలు
Follow Us