/rtv/media/media_files/2025/10/28/chhath-festival-tragic-accident-2025-10-28-06-31-38.jpg)
chhath festival tragic accident
దేశ వ్యాప్తంగా ప్రజలు ఛఠ్ పూజ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌లోని హజారీబాగ్, గర్హ్వా జిల్లాల్లో విషాదకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు అమాయక పిల్లలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హజారీబాగ్‌లోని కెరెదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేలా గ్రామంలో.. ఛత్ పూజ వేడుకల సందర్భంగా ఇద్దరు బాలికలు చెరువులో మునిగిపోయారు. అదే సమయంలో గర్హ్వా జిల్లాలో మూడేళ్ల బాలిక కూడా వేడుకల్లో భాగంగా నీటిలో స్నానానికి దిగి నీటి ప్రవాహానికి మునిగిపోయింది. ఈ ఘటన మృతుల కుటుంబంలో విషాదం నింపింది. పండుగ పూట సరదా సరదాగా ఉండాల్సిన పిల్లలు.. కాటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హజారీబాగ్‌లో మునిగిన ఇద్దరు బాలికలు
హజారీబాగ్‌లోని కెరెదారి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బేలా గ్రామానికి చెందిన 11 ఏళ్ల గుంగున్ కుమారి, 12 ఏళ్ల రూపా తివారీ తమ కుటుంబాలతో కలిసి ఛత్ పూజకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఇందులో భాగంగా చెరువులో స్నానం చేస్తుండగా ఇద్దరు బాలికలు లోతైన నీటిలోకి దిగారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో మునిగిపోయారు. ఆ సమయంలో వారు సహాయం కోసం కేకలు వేశారు. కుటుంబ సభ్యులు, ఇతరులు వారిని రక్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని బయటకు తీశారు. కానీ అప్పటికి ఇద్దరూ చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు.
గర్హ్వా జిల్లాలో 3 ఏళ్ల బాలుడు
జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఇలాంటి విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ డాన్రో నదిలో స్నానం చేస్తూ 3 ఏళ్ల రాహుల్ కుమార్ మునిగి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి నదిలో స్నానం చేయడానికి వెళ్లి ఆడుకుంటూ లోతైన నీటిలోకి దిగి బయటకు రాలేకపోయాడని తెలిపారు.
Follow Us