Goods Train Fire Accident: చెన్నైలో ఘోర ప్రమాదం.. గూడ్స్ ట్రైన్ బ్లాస్ట్

చెన్నై శివారు తిరువళ్లూరు సమీపంలో గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఇంధనం లోడుతో వెళ్తున్న రైలులో మంటలు చెలరేగి ఐదు బోగీలకు వ్యాపించాయి. ఈ ఘటనతో చెన్నై సెంట్రల్ నుండి రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

New Update
chennai Goods Train Fire Accident

chennai Goods Train Fire Accident


చెన్నైలో దారుణమైన ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తిరువళ్లూరు సమీపంలో ఇంధనంతో వెళ్తున్న  గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోర్టు నుంచి చమురుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన కారణంగా తిరువళ్లూరు గుండా వెళ్లే అన్ని రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 

chennai Goods Train Fire Accident

మరోవైపు రైలు నుంచి దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదీగాక ఆ రైలులో చమురు అధికంగా ఉండటం వల్ల మరిన్ని బోగీలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో అదుపు చేసేందుకు కష్టంగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు