/rtv/media/media_files/2025/07/10/businessman-suicide-2025-07-10-19-05-54.jpg)
ఆన్‌లైన్ లైవ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 36 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల్లో ఉన్న ఓ వ్యాపారి.. ఎవరైనా ముందుకు వచ్చి తనని ఆదుకోవాలని వేడుకున్నాడు. ఎవరూ స్పందించకపోవడంతో గన్‌తో పాయింట్ బ్లాక్‌లో షూట్ చేసుకొని చనిపోయాడు. యూపీ లక్నోలో ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. తన నిస్సహాయ స్థితిని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. డయాబెటిక్‌తో బాధపడుతున్న కూతురికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనే సామర్థ్యం కూడా లేదని ఆవేదన పడ్డాడు. ఫేస్‌బుక్ లైవ్ వీడియో చూసి ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే స్పాట్‌కు వెళ్లే సరికి అతను షూట్ చేసుకుని చనిపోయాడు.
#Lucknow
— News1India (@News1IndiaTweet) July 10, 2025
रियल स्टेट कारोबारी ने खुद को मारी गोली
फेसबुक पर एक्टर सलमान शाहरुख से मांगी थी आर्थिक मदद
15 करोड़ के कर्ज में डूबा था रियल स्टेट कारोबारी
शाज़ेब नामक कारोबारी की हुई मौत
गुडंबा थाना क्षेत्र की घटना@lkopolice@Uppolice@dgpuppic.twitter.com/18ap2b0VJb
సెక్యూర్టీ లైసెన్స్ ఉన్న 12 బోర్ గన్‌తో అతను కాల్చుకున్నాడు. బలవన్మరణానికి ముందు అతను తన ఫేస్‌బుక్ వీడియోలో అందర్నీ వేడుకున్నాడు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. తన కుటుంబాన్ని ఆదుకోవాలన్నాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇలా చేస్తున్నానని చెప్పాడు. తనకు 15 కోట్ల అప్పు ఉందని, అతని బిజినెస్ పాట్నర్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపించాడు. డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న తన కూతుర్ని ఇన్సులిన్ ఇవ్వలేకపోతున్నట్లు అతను ఆవేదన వ్యక్తం చేశాడు.