బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌ను విడిచిపెట్టేదే లేదంటోంది బిష్ణోయి గ్యాంగ్. తాజాగా మరోసారి సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్‌లు పంపింది. ఐతే ఈ బెదిరింపు మెసేజ్ ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్‌కు రావడం చర్చనీయాంశంగా మారింది. రూ.5 కోట్లు ఇస్తే ఇక్కడితో వివాదానికి ఫుల్‌స్టాప్ పెడదామని..లేదంటే బాబా సిద్దిఖీ కంటే దారుణంగా సల్మాన్‌ను హత్య చేస్తామనేది ఆ మెసేజ్ సారాంశం. ఈ బెదిరింపులు తేలిగ్గా తీసుకోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది. సల్మాన్ ఖాన్ బతకాలనుకుంటే బిష్ణోయ్‌తో శత్రుత్వానికి ముగింపు పలకాల్సిందేనంటూ సూచించింది.
ఇది కూడా చదవండి: సిన్వర్ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో
తండ్రి కొడుకులిద్దరినీ చంపేస్తాం..
ఇక బిష్ణోయి గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌ను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. 2018లో ఫస్ట్ టైం లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు మొదలయ్యాయి. అప్పటికే లారెన్స్ బిష్ణోయి పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరించాడు. ఐతే ఆ బెదిరింపులను సల్మాన్ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం అటెన్షన్ కోసం బిష్ణోయి ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావించారు. కానీ 2022లో ఆ బెదిరింపులు నిజమయ్యాయి. సల్మాన్ ఖాన్ తండ్రి ఇంటి బయట వాకింగ్ చేస్తున్న టైంలో అక్కడే ఉన్న బెంచ్‌పై ఓ లెటర్‌ను గుర్తించారు. తండ్రి కొడుకులిద్దరినీ చంపేస్తామంటూ ఆ లేఖలో హెచ్చరించారు. ఆ ఏడాది ప్రారంభంలోనే పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాన బిష్ణోయి గ్యాంగ్ చంపేసింది. మార్చి 2023లో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్ ఒకరికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఇందుకు సంబంధించి బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!
బాల్కనీ టార్గెట్‌గా పలు రౌండ్ల కాల్పులు
2024లో ఈ వైరం మరో స్థాయికి చేరింది. ఏకంగా ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి బయట బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు కాల్పులు జిపారు. మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు..ఫస్ట్ ఫ్లోర్‌లోని బాల్కనీ టార్గెట్‌గా పలు రౌండ్ల కాల్పులు జరిపారు. మొదట్లో ఎవరో టపాసులు కాలుస్తున్నారని భావించిన సల్మాన్ ఖాన్..తర్వాత బిష్ణోయి గ్యాంగ్ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ కాల్లుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ముంబై శివారు పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లే దారిలో కారు అడ్డుపెట్టి సల్మాన్‌ను హత్య చేయాలని బిష్ణోయి గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఐతే ఈ ప్లాన్‌ను ముంబై పోలీసులు తిప్పికొట్టారు. బిష్ణోయి గ్యాంగ్‌కు చెందిన నలుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి AK - 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ
సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రాలో కాల్చి చంపారు బిష్ణోయి గ్యాంగ్ ముఠా. ఈ కేసులో ఇ్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక బాబా సిద్దిఖీ హత్య జరిగిన తర్వాత సల్మాన్‌కు సెక్యూరిటీ పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం. Y+ సెక్యూరిటీని కేటాయించింది.
ఇది కూడా చదవండి: వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ?
ముంబై పోలీసులు ప్రకటన..
సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కుట్ర చేసిందంటూ నవీ ముంబై పోలీసులు ప్రకటన చేసిన మరుసటి రోజే బెదిరింపు సందేశం రావడం చర్చనీయాంశంగా మారింది. నిందితుడు సుఖా అలియాస్ బల్బీర్ సింగ్‌ను హర్యానాలోని పానిపట్‌లో బుధవారం అరెస్టు చేసింది. సల్మాన్‌ను చంపేందుకు బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు కాంట్రాక్టు ఇచ్చినట్లు సుఖ్బీర్ పోలీసుల ముందు అంగీకరించారు. సల్మాన్‌ను చంపేందుకు పాకిస్థాన్ నుంచి AK - 47, M-16, AK - 92 వంటి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించాలని ప్లాన్ చేసినట్లు చెప్పాడు. బాబా సిద్దిఖీ హత్య, సల్మాన్‌కు వరుస బెదిరింపులు ఇప్పుడు ముంబైలో సంచలనంగా మారాయి.